ప‌రుచూరు పోరు.. ఆమంచితో బిగ్ య‌డ్వాంటేజ్‌.. ‘ ఏలూరి ‘ హ్యాట్రిక్ ప‌క్కా.. !

ఏలూరి సాంబశివరావు 2014 ఎన్నికలకు ముందు వరకు ఈ పేరు ఏపీ రాజకీయాల్లో పెద్దగా వినపడలేదు. అంతకుముందు వరకు సాంబశివరావు ప్రకాశం జిల్లా పర్చూరు టిడిపి ఇన్చార్జిగా ఉండేవారు. అయితే అప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఢీ కొట్టి 2013 స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి మంచి విజయాలు కట్టబెట్టారు. ఇక 2014 ఎన్నికలలో పరిచూరు నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన సాంబశివరావు ఐదేళ్లపాటు నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.

నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా.. కొన్ని ఏళ్లపాటు పరిష్కారం కానీ సమస్యలను కూడా పరిష్కరించారు. ఇక 2019 ఎన్నికలలో ఏలూరి సంచలన విజయం నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభంజనం వీచినా కూడా ఏలూరి వరుసగా రెండోసారి విజయం సాధించారు. పైగా అటువైపు వైసీపీ నుంచి రాజకీయాల్లో త‌లపండిన.. కాకలు తీరిన నేత, సీనియర్ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఓడించడం అంటే మామూలు విషయం కాదు.

ఓవైపు సీనియర్ నేత, మరోవైపు వైసీపీ ప్రభంజనం.. అటు జగన్ ఒక్కసారి ఛాన్స్ ఇలా ఎన్ని ఉన్నా కూడా పర్చూరులో మళ్లీ గెలిచి సత్తా చాటారు సాంబశివరావు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే పార్టీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న అధినేతకు పార్టీ క్యాడర్‌కు ఎప్పటికప్పుడు ఏలూరి అండగా నిలబడుతూ వస్తున్నారు. ఏలూరిపై ఉన్న నమ్మకంతోనే చంద్రబాబు ఆయనను కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా నియమించారు. ఈ క్రమంలోనే గత యేడాదిన్నర కాలంగా సాంబశివరావు తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చారు.

ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేలను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏలూరి హ్యాట్రిక్ కు బ్రేకులు వేయాలని పరుచూరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే ప‌రుచూరులో గత రెండు ఎన్నికల్లోను క‌మ్మ‌ నేతలకు టిక్కెట్ ఇవ్వగా వారిద్దరూ ఓడిపోవడంతో ఇప్పుడు కాపు వ‌ర్గానికి చెందిన‌ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ని తీసుకువచ్చి పరుచూరు పగ్గాలు అప్పగించారు. ఇంకా చెప్పాలంటే అసలు ఆమంచి రావటమే ఏలూరికి చాలా ప్లస్ అని అన్ని రాజ‌కీయ ప‌క్షాలు… అన్ని రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు వ‌న్‌సైడ్‌గా చెపుతున్నాయి.

ప‌రుచూరులో ఆమంచికి అన్ని మైన‌స్‌లే ఉన్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న క‌మ్మ నేత రావి రామ‌నాథం బాబు ఉన్న‌ప్పుడు అయినా కొంద‌రు క‌మ్మ నేత‌లు వైసీపీ వైపు ఉన్నారేమో గాని… ఇప్పుడు వారిలో మెజార్టీ ఏలూరి వైపు వ‌చ్చేస్తున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లోనూ ఏలూరికి బ‌ల‌మైన గ్రిప్ ఉంది. ఇక కాపు వ‌ర్గంలోనూ ఏలూరికి వీరాభిమానులు ఎక్కువే. ఓవ‌రాల్‌గా చూస్తే ప‌రుచూరులో ఏలూరికి జ‌గ‌న్ హ్యాట్రిక్ బాట వేసి మ‌రి ఆయ‌న్ను ముచ్చ‌ట‌గా మూడోసారి అసెంబ్లీకి పంపుతోన్న‌ట్టే..!