బ్లాక్ బెర్రీ మన రాష్ట్రంలో ఈ పండు గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఫ్రూట్స్ మార్కెట్లో కూడా ఎక్కడో కానీ కనిపించదు. కానీ మనం తినే చాలా ఆహార పదార్థాల్లో బ్లాక్ బెర్రీ వాడుతూ ఉంటారు. ఈ ఫ్రూట్ మన దేశంలో కంటే యూకే లో ఎక్కువగా దొరుకుతాయి. వేసవి చివర నుంచి అక్టోబర్ మధ్య వరకు బ్లాక్ బెర్రీలు దొరుకుతాయి. అడవుల్లో, పొదల్లో వాటిని పండిస్తారు. అయితే ఈ పండు క్యాన్సర్, గుండె, మెదడు జబ్బులకు ఉపయోగపడుతుందని వైద్యలు చెబుతున్నారు.
అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలను కూడా దరిచేరకుండా చూసుకుంటుంది. ఈ ఫ్రూట్ తిన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విటమిన్ సి, పొడెంషియం ఎక్కువగా ఉండటంతో ఇవి గుండెకి సంబంధించిన అనేక జబ్బులను నయం చేస్తాయి. అలాగే మెదడు వేగంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే వీటిని అధికంగా తినడం వల్ల ఎలర్జీ వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. అందుకని సరిపడానే తీసుకోవాలి.