కావ్య ని ఇంట్లో నుంచి గెంటేసిన రాజ్…. దుగ్గిరాల వంశంపై ఉగ్రరూపం చూపించిన కనకం….!!

అపర్ణ రాజ్ కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రా అంటుంది. కావ్య ఇంటికి వెళ్తుంది అపర్ణ చెయ్యి అడ్డుపెట్టి ఆపేస్తుంది. కావ్య ఈరోజు నేను ఏం నేరం చేశాను అని అడుగుతుంది. అపర్ణ నా కొడుకు గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అని అంటుంది. నువ్వు ఎంత లో ఉండాలో అంతలోనే ఉండక నీ నిరుపేద స్థాయికి నా కొడుకుని ఎందుకు లాగుతున్నావ్ అని అపర్ణ.. కావ్య పై సీరియస్ అవుతుంది. కావ్య.. రాహుల్ వైపుకు చూసి అక్కడ మనిషిని పెట్టారన్నమాట అని అపర్ణాన్ని తిడుతుంది. అపర్ణ నువ్వు ఏం మట్టిలో అన్న మునిగితేలు నా కొడుకు నీ ఎందుకు దాంట్లో లాగుతున్నావ్ అని కావ్యని తిడుతుంది. రుద్రాణి కాస్త ఆలోచిస్తే రాజ్ ని కూడా తీసుకువెళ్లి బొమ్మలు చేపిస్తారు అని అంటుంది.

కావ్య.. రుద్రాణిపై సీరియస్ అవుతుంది. నా కొడుకుని కూలివాడిగా తయారు చేస్తే మాత్రం నేను ఊరికినే ప్రశాంతత‌ లేదు అని అపర్ణ కావ్య పై సీరియస్ అవుతుంది. కావ్య అసలు మీ ప్రాబ్లం ఏంటి అత్తయ్య నేను డిజైన్స్ వేసి ఆ డబ్బులు మా పుట్టింటికి ఇస్తే మాత్రం నచ్చదు. పోనీ మా ఆయన నన్ను వెనకేసుకొచ్చి ఇలాంటి వాళ్ల ముందు నా వైపు మాట్లాడితే మీకు నచ్చదు. ఎక్కడ భార్యగా ఒప్పేసుకుంటారో అని భయం. ఏదైనా చిన్న విషయం జరిగితే మీ కొడుక్కి భూతద్దంలో చూపించి నన్ను మాటలు అనిపించే వరకు మీరు నిద్రపోరు.
అసలు మీ కొడుక్కి మీరు కన్న తల్లేనా అని కావ్య అప‌ర్ణ‌ అంటుంది. అంతలోగా రాజ్ వచ్చి ఏమన్నావ్ అని కావ్య పై చేయి లేపుతాడు.

కనకం వర్షం వస్తుందని బొమ్మలు తీస్తానికి వెళ్తే కాలికి పూలకుండి అడ్డు వచ్చి బొమ్మలు పగిలిపోతాయి. కావ్య మీ అమ్మకి నేను ఇంట్లో ఉండడం నచ్చట్లేదు అని రాజ్‌తో అంటుంది. అవునా అయితే నాకు కూడా నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు వెళ్ళిపో అని రాజ్ అంటాడు. రాజ్ కావ్యాన్ని నువ్వెంత నీ స్థాయి ఎంత మా అమ్మని పట్టుకుని అన్ని మాటలంటావా అని కావ్య పై సీరియస్ అవుతాడు. రాజ్ కామెడీగా బయటికి గెంటేస్తాడు. కావ్య నేను ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతుంది. నీ ఇంటికే వెళ్ళు అని రాజ్ అంటాడు. నా ఇల్లు ఇదే అని కావ్య అంటే రాజ్ పరాయి వారికి మా ఇంట్లో స్థానం లేదు అని అంటాడు. మీరు నన్ను లోపలికి రానిచ్చే వరకు నేను గుమ్మం ముందే ఉంటానని కావ్య అక్కడే ఉంటుంది.

కావ్య వానలో తడుస్తూ నుంచుంటుంది కళ్యాణ్ వచ్చి అన్నయ్య ఏంటిది తాళి కట్టిన భార్యని ఇలా గెంటేయడం కరెక్ట్ కాదు అంటాడు. కళ్యాణ్ నాకు అమ్మాయి నా పెద్దమ్మ అయినా ఒకటే. ఇప్పుడు వదిన వచ్చిన తర్వాత కూడా నన్ను అమ్మలాగే చూసుకుంది. ఆ స్వప్న లాంటి దానిని అయితే అసలు నేను పట్టించుకోను వెళ్లి పిలువు అన్నయ్య ప్లీజ్ అని బ్రతిమాలుతాడు కళ్యాణ్. రాజ్ నేను ఇంటి బయట నిలబడమని చెప్పలేదు కావాలని తను నిలబడింది వర్షంలో అంటాడు.‌ కనకం వచ్చి నీకు ఇంత శిక్ష వేస్తారా? వీళ్ళు మనుషుల రాక్షసుల అని లోపలికి తీసుకు వెళుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.