‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… ట్రేడ్‌ను షేక్ చేస్తోన్న బాల‌య్య‌..!

బాల‌య్య ‘ భ‌గ‌నందమూరి నరసింహ బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ డూపర్ నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోని ఈ ఏడాది దసరాకు మరోసారి అదిరిపోయే కాంబినేషన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా భగవంత్‌ కేసరి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ శ్రీ లీల బాలయ్యకు కూతురుగా కీలక పాత్రలో కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం భగవంత్‌ కేసరి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవబోతుందన్న చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ అదిరిపోయే రెస్పాన్స్ అందుకోగా.. ఇక సినిమా కూడా హ్యాట్రిక్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు ధీమాగా ఉన్నారు.

ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతుంది. లేటెస్ట్‌గా భగవంత్ కేసరి ఓవర్సీస్ డీల్‌ లాక్ అయ్యింది. ఈ సినిమా పంపిణీ హక్కులు ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్‌ కొనుగోలు చేసినట్టుగా కన్ఫామ్ చేశారు. ఇందుకోసం భారీ మొత్తంలో డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 18 నుంచి భగవంత్ కేసరి యూఎస్ ప్రీమియర్స్ పడనున్నాయి.