రాశీఖ‌న్నా ప్రియుడు ఎంత ప‌ని చేశాడు… ఆమెను ఏం చేశాడో చూడండి..!

రాశీ ఖ‌న్నా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో పాటు అమాయకత్వాన్ని కూడా కనబరిచిన ఆమె నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా వెలుగు వెలిగిన రాశి ఖ‌న్నా ఇటీవల నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ వైపుకు రాశి ఖ‌న్నా చూపు వెళ్ళింది.

ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లో, సినిమాల్లో రాణిస్తూ బిజీగా ఉన్నా రాశి తాజాగా నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక వ్యక్తితో లవ్ బ్రేకప్ కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లి నేను బరువు బాగా పెరిగిపోయానని తర్వాత ఎంత ప్రయత్నించినా థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల బరువు తగ్గలేకపోయాన‌ని చెప్పుకొచ్చింది. బరువుగా ఉండడం వల్లే సినిమాల్లో ఆఫర్స్ రాలేదని వెల్లడించిన రాశి.. అదే టైంలో ఓ వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడిందని పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పుకొచ్చింది.

అతని వల్ల డిప్రెషన్ నుంచి బయటపడిన నేను చాలా వెయిట్ తగ్గానని.. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని వివ‌రించింది. అతడితో డేటింగ్ చేయడమే నేను బరువు తగ్గడానికి ప్రధాన కారణమని డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి కూడా అతనితో ప్రేమలో పడడమే కారణం అంటూ వివరించండి. ఇంతకీ రాశి ఖ‌న్నా ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరో బయటపెట్టలేదు.