Guppedantha manasu today episode : భర్తని వెనకేసుకొచ్చిన ధరణి.. రిషి మాటలకు షాకైన‌ వసుధారా..!

నిన్నటి గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార తప్పు నా వల్లే జరిగిందని ఒప్పుకున్నాను అందుకే అన్ని అవమానాలు భరిస్తూ వచ్చిన రిషి సార్ నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటూ తండ్రి వద్ద బాధపడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. ఇవన్నీ విన్న చక్రపాణి నువ్వు నీవైపు నుంచి ఆలోచిస్తున్నావు కానీ ఆయన వైపు నుంచి ఆలోచించడం లేదు.. జరిగింది చిన్న విషయం కాదు నువ్వు రక్షించినంత మాత్రాన ఆయన అన్ని మర్చిపోవ‌డం చాలా కష్టం. ఆయన మనసులో బాధ చెరిగిపోదు.. ఆయన కూడా మనిషే కదా నువ్వు అర్థం చేసుకో మనసుకి.. మనిషికి మధ్యన ఒక సన్నని పొర ఉంటుంది. అపొర చినిగిపోయిన రోజు కచ్చితంగా ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు అని కూతురికి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తున్న వసుధార‌కి జగతి ఓ మెసేజ్ పెడుతుంది. గురుదక్షిణ విషయంలో ఒకసారి మహేంద్ర దగ్గర మరోసారి నా దగ్గర ఇబ్బంది పడ్డావు.. నీ చేత చేయించకూడని పని చేయించాను ఇకపై నీ విషయంలో నేను కానీ మహేంద్ర కానీ జోక్యం చేసుకోము కానీ నిన్ను ఒక కోరిక కోరుతున్నాను.. ఇది నీ గురువుగా కాదు కేవలం రిషి తల్లిదండ్రులుగా మాత్రమే అడుగుతున్నాము. దయచేసి మామూలు మనిషిని చెయ్యి మరిచిపోయిన ప్రేమని మళ్లీ పునరుద్ధరించేలాగా చెయ్యి అంటూ రిక్వెస్ట్ చేస్తూ జగతి మెసేజ్ చేస్తుంది. మరో పక్క శైలేంద్ర రౌడీ ఫోన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేద్దామనుకుంటాడు రిషి.. కానీ ఇంతలో ఫోన్ స్విచాఫ్ అయిపోతుంది.

వెంటనే రిషి పోలీసులకు కాల్ చేసి కాలేజ్ దగ్గర లంచ్ అవర్ లో కలుద్దామని చెప్తాడు. మరోపక్క ఏం జరుగుతుందో అర్థం కాక శైలేంద్ర ప్రెస్టేట్‌ అవుతాడు. అదే కోపంతో కిందకి వచ్చేసరికి భార్య కాఫీ ఇస్తుంది. కోపంతో ఆ కాఫీని శైలేంద్ర నేలకేసి కొడతాడు. అ శబ్దానికి ఫ‌నింద్ర కోపంతో కిందకు వచ్చి ఏం జరిగిందని కాఫీ నేలకేసి కొట్టావు రోజురోజుకీ ని ప్రవర్తన మరి దిగజారిపోతుంది.. అసలు కప్పు నేలకేసి కొట్టాల్సిన అంత పని ఏమొచ్చింది అంటూ అడుగుతాడు. ఇందులో ఆయన పొరపాటు ఏం లేదు నా చేయి జారి పడిపోయింది అంటూ భర్తని వెనకేసుకు వస్తుంది ధరణి.

నువ్వు చెప్పినది నిజమేనా.. అయినా ఎందుకు నీ భర్త దగ్గర భయపడుతున్నావు నువ్వు భయపడుతూ ఉంటే నికాపురం కుదుటపడదని ధరణికి చెప్పి.. భార్యని ప్రేమించాలి కాని భయపెట్టకూడదు తను మారాలని చూస్తున్నావుగాని నువ్వు మారే ప్రయత్నం చేయడం లేదు తను చేసే ప్రతి పని పర్ఫెక్ట్ గా ఉంటుంది.. నువ్వు చేసే పనిలో నీకే క్లారిటీ ఉండదు అని కొడుకుని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. కొంతసేపటికి అక్కడికి వచ్చిన జగతి ఎందుకు అబద్ధం చెప్పావు అని ధరణి అడుగుతుంది. ఆయనకి మావయ్య అంటే కాస్త భయం ఉంది ఇప్పుడు అసలు విషయం తెలిస్తే ఆ భయం కూడా పోయి మరింతగా రెచ్చిపోతారు అందుకే అలా అబద్ధం చెప్పాను చిన్న అత్తయ్య అంటూ చెబుతుంది. జగతి.. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష ధరణి అని చెప్పి వెళ్ళిపోతుంది. మరో పక్క కాలేజీకి పోలీసులు వస్తారు.

ఆ పోలీసులను చూసిన వసుధార‌ ఏంటి సార్ కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. లేదు రిషి గారు రమ్మన్నారని వచ్చాను అని ఎస్ఐ సమాధానం ఇస్తాడు. రిషి క్యాబిన్ కి ఎస్ ఐ ని తీసుకువెళ్తుంది వ‌సుధార‌. అప్పుడు రిషి ఫోన్ గురించి ఎస్ఐకి చెప్తూ ఉంటాడు. ఈలోపు రిషికి వేరే కాల్ వచ్చి అక్కడ నుంచి పక్కకు వెళ్తాడు. శైలేంద్ర మళ్ళీ రౌడీ ఫోన్ కి కాల్ చేసి అసలు ఎందుకు ఫోన్ మాట్లాడటం లేదు ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మాటలను గుర్తుపట్టిన వసుధార‌ ఎస్సైకి ఫోన్ ఇస్తుంది. ఎస్సై హలో అనడంతో గొంతు మారింది అని శైలేంద్ర వెంటనే ఫోన్ కట్ చేస్తాడు.

ఇంతలో రిషి లోపలికి వస్తాడు. ఎస్ఐ ఆ గొంతు గుర్తుపట్టారా అని వసుధార‌ని అడుగుతాడు. ఆ గొంతు రిషి సార్ వాళ్ళ అన్నయ్య శైలేంద్రది అని చెప్తుంది వసుధార‌. అవునా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు రిషి. అవును సార్ ఆ రోజు మేము తప్పు చేయడానికి.. ఈరోజు మీ మీద జరుగుతున్న అటాక్‌ని కారణం అతనే కానీ మీరు నమ్మరు అనే ఉద్దేశంతో మేము చెప్పలేదు అంటుంది వసుధార‌. ఇప్పుడు మాత్రం నమ్ముతానని ఎలా అనుకుంటున్నావో ఆరోజు నా మీద అభియోగం మోపారు.. ఈరోజు మా అన్నయ్య మీద మోపుతున్నారా.. మా అన్నయ్యకి నేను అంటే ప్రాణం అంటూ అన్నయ్యని వెనకేసుకొస్తాడు రిషి. అతని మాటలకు వసుధార‌ షాకే ఆయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.