క‌ల్కి ‘ 2898 AD ‘ వాయిదా క‌న్‌ఫార్మ్ చేసిన నాగ్ అశ్విన్‌..!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ కల్కి 2898 ఏడి ‘ . నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమ గ్లింప్స్‌ రిలీజై మూవీ పై అంచ‌ల‌ను మరింతగా పెంచాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది అంటూ వార్తలు ఊపందుకున్నాయి.

దీనిపై సినిమా డైరెక్టర్ స్పందించారు.. ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్‌ అశ్విన్ దీని గురించి మాట్లాడుతూ కల్కి షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందని ఇంకా కొంత భాగం మాత్రమే మిగిలి ఉందని ప్రస్తుతం నేను దానిపైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నానని ఆ కొంత భాగం కూడా పూర్తవగానే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తామ‌ని వివ‌రించాడు. ఒక మంచి రోజు చూసుకొని దీని గురించి ప్రకటన ఇస్తుంది మూవీ టీం. ఈ సినిమాతో అందరూ ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి లుక్ లో కనిపించి ఉండడు అందుకోసమైనా ప్రేక్షకులంతా ఈ సినిమా చూడాలి అంటు చెప్పుకొచ్చాడు.

థియేటర్స్‌కు వచ్చి సినిమాను చూసిన వారంతా ఒక కొత్త అనుభూతిని పొందుతారు అని వివరించాడు. కల్కి 2898 ఏడి అనౌన్స్‌మెంట్‌ చేసినప్పుడు ఈ ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. మొదటి భాగం మే 9న రిలీజ్ చేయబోతున్నారట. దీంతో ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా చాలా టైం పట్టేలా ఉందని సమాచారం. ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చారు. సైన్స్ ఫ్రిక్షన్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్ కీరోల్‌ ప్లే చేశారు.