Allu Arjun : గంగోత్రి హీరోయిన్ తో అల్లు అర్జున్..!

అల్లు అర్జున్ (Allu Arjun) మొదటి సినిమా గంగోత్రి హీరోయిన్ అదితి అగర్వాల్ గుర్తుంది కదా. స్టార్ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ చెల్లెలిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అదితి అగర్వాల్. అయితే ఆమె కేవలం తక్కువ సినిమాలకే కెరియర్ ఆపేసింది. గంగోత్రి హీరోయిన్ ఆ సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ ఒకచోట కలిశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ యూఎస్ లో ఉన్నాడు. కలవాలని కలిశారో లేక అలా కుదిరిందో తెలియదు కానీ అల్లు అర్జున్ తో అదితి అగర్వాల్ దిగిన లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

20 ఏళ్ల క్రితం కలిసి నటించిన ఈ ఇద్దరు మళ్లీ కలిసి ఫోటో దిగి ఆడియెన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. గంగోత్రి టైం లో అల్లు అర్జున్ (Allu Arjun) మీద చాలా విమర్శలు వచ్చాయి. వాటి అన్నిటికీ తన కష్టంతో స్టార్ గా ఎదిగి ఆన్సర్ ఇచ్చాడు బన్నీ. ఇక ఆ సినిమాలో నటించిన అదితి మాత్రం కొన్నాళ్లకే అడ్రెస్ లేకుండా పోయింది.

యూఎస్ లో వీరిద్దరి కలయిక క్రేజ్ తెచ్చుకుంది. మళ్లీ అదితి స్క్రీన్ పై కనిపించాలని అనుకుంటుందా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. 20 ఏళ్లు అవుతున్నా అదితిలో పెద్దగా మార్పులు రాలేదని చెప్పొచ్చు.

Tags: Adithi Agarwal, allu arjun, Gangotri, Iconstar Allu Arjun, Pushpa, Pushpa Raj, Tollywood