సైమా అవార్డ్స్‌లో దుమ్ముదులిపిన పుష్ప!

సైమా అవార్డ్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా దుమ్ముదులిపింది. అవును, తాజాగా బెంగుళూరులో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పుష్ప స్టార్స్ సందడి చేశారు. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా మరో 5 కేటగిరిల్లో కూడా పుష్ప సినిమాకు అవార్డులు దక్కడం విశేషమనే చెప్పుకోవాలి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి జనాదరణ పొందింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌ రాబట్టింది.

ఇక ఈమూవీ నైజాం (తెలంగాణ)లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి విదితమే. తాజాగా సైమ అవార్డ్స్ పుష్ప సినిమా సత్తా చాటింది. ఎంతో ఘనంగా ఇండియన్ సినిమా దగ్గర ఎందరో బిగ్ స్టార్స్ హాజరు అయ్యిన సమక్షంలో సైమా అవార్డ్స్ వేడుక బెంగళూర్ లో జరిగింది. అయితే సైమా అవార్డ్స్ ఎంపిక పోల్స్ ద్వారా జరగగా మన తెలుగు సినిమాల్లో గత ఏడాది రిలీజ్ అయ్యిన చిత్రాల్లో అనేక అంశాల్లో పలు చిత్రాలు అవార్డులు సాధించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత ఇలా మొత్తం 6 కేటగిరీల్లో పుష్ప సినిమా అవార్డులు దక్కించుకుంది.

ఇక ఈ హ్యాపీ మూమెంట్ ని అయితే ఐకాన్ స్టార్ తన ట్రెండ్ సెట్టింగ్ మ్యానరిజం ‘తగ్గేదేలే’ అంటూ స్టేజి పై చేసిన పిక్ షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసాడు. మరోసారి బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఇలా 2 సార్లు అవార్డు రావడం అనేది చాలా అరుదైన ఘనతగా తాను భావిస్తున్నానని ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఐకాన్ స్టార్ తెలిపాడు. పుష్ప సినిమా సక్సెస్‌తో ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ సీక్వెల్‌కు సిద్ధమవుతంది. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలస్తొది.

Tags: allu arjun, highest, Pushpa, rare record, siima awards, sukumar