ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రోల్. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో సరికొత్త పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.
సెకండ్ పార్ట్ లో కూడా ఆయన బాగా అలరిస్తారంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. రిలీజ్ అయిన పోస్టర్ స్టైలిష్ గా ఉంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ , అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ తదితరులు కీలకపాత్ర వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.