టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి స్పందించారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అంటూ పేరు పెట్టి కేసులో చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష నేతల నుంచి కూడా చంద్రబాబును అరెస్టు చేసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే సిపిఐ రామకృష్ణ బాబును అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. తాజాగా ఇప్పుడు పురందేశ్వరి కూడా దీనిపై స్పందించారు. ఈరోజు చంద్రబాబు గారిని అరెస్టు చేయడం చాలా దారుణం.. సరైన నోటీసు ఇవ్వకుండా.. ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా ఆయన వివరణ తీసుకోకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్టు చేయటం సరైన పద్ధతి కాదు.. బిజెపి దీనిని ఖండిస్తుంది అంటూ పురందరేశ్వరి కామెంట్ చేశారు.
ఇక బాబు అరెస్టుపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ క్యాంప్ సైట్ వద్ద నారా లోకేష్ నిరసన కొనసాగుతోంది. చంద్రబాబును చూసేందుకు వెళ్లేందుకు పోలీసులు నిరాకరించడంతో ఉదయం 6 గంటల నుండి లోకేష్ నిరసన కొనసాగుతోంది. జాతీయ జండాతో ఎండలోనే కూర్చుని నిరసన తెలుపుతున్న లోకేష్ను పోలీసులు కదలకుండా అడ్డకుంటున్నారు.