చంద్ర‌బాబు అరెస్టులో ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలేవి…..

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ? ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడుని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబును ఏ చట్టం ప్రకారం అరెస్టు చేశారు ? ఇందులో ఎలాంటి వాస్తవం లేదు… వైసీపీ స‌ర్కార్ కావాలని రాజకీయ క‌క్ష‌తో చేసిన పని అని టిడిపి ఆరోపిస్తుంది. డిజైన్ టెక్ సంస్థ ఒప్పందం ప్రకారం అన్ని వస్తువులు టెక్నాలజీ సాఫ్ట్వేర్ తో సహా ఇచ్చిందని సరిచూసుకొని 2020లో జగన్ ప్రభుత్వం హయంలోనే ఈ సంస్థకు అభినందన పత్రం ఇచ్చిన మాట వాస్తవం కాదా ? డిజైన్ టెక్ సంస్థ అకౌంట్లు ప్రీజ్‌ చేసి నిధులు స్తంభింప‌ చేసినప్పుడు కోర్టు మీకు చీవాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు లేవు.

సీమెన్స్ ఎండిని మరో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచి చంద్రబాబుపై ఆరోపణ చేయాలని కూడా వారిని ఇబ్బంది పెట్టారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక గుజరాత్‌తో సహా అనేక రాష్ట్రాలు చేసుకున్న ఈ ఒప్పందాన్ని ఎలా ? తప్పు అంటారున్న‌ది జగన్ ప్రభుత్వానికి తెలియాలన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ సంస్థ ద్వారా 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని ఎలా కుంభకోణం ?అంటారని స్వయంగా హైకోర్టు కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసిందంటూ సమాచారం.

ఈ ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్ చేసిన 18 నెలలకు విచారణ అధికారులు లేకుండా డిఐజి స్థాయి అధికారి ఏ విధంగా ? అరెస్టు చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కోర్టు నుంచి కనీసం అనుమతి కూడా లేదని ఈ కేసులో ఎలాంటి ? కుంభకోణం లేదనటానికి అందులో శిక్షణ తీసుకున్నాం 2.13 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్ష సాక్షులు అన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పుడో డిసెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంతవరకు ఎలాంటి చార్జిషీట్ కూడా దాఖలు చేయకపోగా చంద్రబాబుని అరెస్టు చేయాలన్న కుట్రతోనే పక్కా ప్రకారం ఇదంతా చేస్తున్నట్టు ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.