ఇలా ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తే ఖ‌చ్చితంగా నో అన‌నే అన‌రు…ఆ టెక్నిక్ ఇదే..!

ప్రేమించడం ఒక ఎత్తు అయితే ఆ ప్రేమను వ్యక్తపరచడం మరొక ఎత్తు. ఎదుట మనిషి మన ప్రేమని ఒప్పుకునే లాగా మన ప్రేమలో భావాన్ని చెప్పడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రేమ సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతాయి. ఒక వ్యక్తి పరిచయం అయిన తరువాత స్నేహం చేస్తారు. ఆ తర్వాత ఆ మనిషి ప్రవర్తన వలన తెలియకుండానే ప్రేమలో పడిపోతాం. కానీ మన ప్రేమ ఎదుటి వారితో చెప్పితే ప్రేమ మాట పక్కన పెడితే స్నేహం పోతుందేమోనని ఆలోచిస్తూ ఉంటారు.

అలాగే ఒప్పుకోకపోతే భరించడం ఎలాగో అని చాలామంది భయపడుతుంటారు. అందుకే మీరు ప్రేమించిన మనిషి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మీ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మనసులో మీ పైన ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోండి. తన మనసులో మీకున్న ప్రాధాన్యత ఏమిటో పసిగట్టండి. తరువాత వారి ఇష్టా ఇష్టాలని తెలుసుకోండి. తనకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్లి మీ ప్రేమ అర్థమయ్యేలా చెప్పండి.

లవ్ ప్రపోసల్ అంటూ పెద్ద హడావిడి, ఫ్రెండ్స్ తో పిచ్చిపిచ్చి వేషాలు చేష్టలు వేయకండి. ఒకవేళ మీ ప్రేమను ఎదుట వ్యక్తి స్వీకరించకపోతే మీరే అవమానానికి గురవుతారు. మీరు లవ్ ప్రపోజల్ చేస్తున్నారంటే దానికి బలమైన కారణాలు ఆ అమ్మాయి గుర్తించగలగాలి. ఎందుకంటే తెలియని వ్యక్తి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్న అంటే అసహజంగా ఉంటుంది.

లవ్ ప్రపోజ్ చేయడానికి టైమింగ్ కూడా ఎంతో ఇంపార్టెంట్. టైమింగ్ మిస్ అయితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ మనిషి మూడ్ ఎలా ఉందో తెలుసుకుని ఆ తర్వాత ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేసే ముందుగా తనకి మీ ప్రేమ అర్థమయ్యేటట్టు కొన్ని హింట్స్ ఇవ్వండి. దీనివల్ల ఆమె మీ ప్రపోసల్ కి కొంచెం ప్రిపేర్ గా ఉంటుంది‌. మీరు ప్రపోజ్ చెయ్యంగానే వెంటనే డిసిషన్ చెప్పాలని అనుకోకండి. ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొంచెం టైం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఆ అమ్మాయికి మీ మీద గౌరవం పెరిగి కచ్చితంగా మీ ప్రపోసల్ ని యాక్సెప్ట్ చేస్తుంది.