మోడీకి షాక్‌… వార‌ణాసి బ‌రిలో ప్రియాంక గాంధీ ఫిక్స్‌…!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత రెండు ఎన్నికల్లోను ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి లోక్ సభకు ప్రాతనిత్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికలలో వారణాసి తో పాటు గుజరాత్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఈ రెండు లోక్సభ సీట్లలోను ఆయన ఘనవిజయం సాధించారు. అయితే సొంత రాష్ట్రమైన గుజరాత్ లోక్‌స‌భ స్థానానికి రాజీనామా చేసి వారణాసి నుంచి లోక్‌స‌భకు ప్రాధనిత్యం వహిస్తున్నారు.

అయితే ఈసారి వారణాసిలో మోడీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. దీంతో ఆయన వారణాసితో పాటు తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఒక లోక్‌స‌భ స్థానం నుంచి లేదా దక్షిణాదిలో తమిళనాడులోని కన్యాకుమారి లేదా రామేశ్వరం లేదా ఇటు మహారాష్ట్రలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తారని.. ఈసారి మోడీ ఖచ్చితంగా రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి. తాజాగా ఉద్థ‌వ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన రాజ్యసభ ఎంపీ సంజ‌య్ రాత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే లోకసభ ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీగా ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే తప్పక గెలుస్తారని ఆయ‌న ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రాయబరేలి – వారణాసి – అమేథిలో బిజెపికి గట్టి పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.