ఎక్కడైనా నేను గెలుస్తాను.. రాసిపెట్టుకో.! నాదే గెలుపు రాసుకో!! అంటూ.. నాయకులు చేసే వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఇది రాజకీయాల్లో కూడా సర్వసాధారణం. నాయకులు అన్నాక ఆ మాత్రం పస ఉండాల్సిందే. అయితే, ఈ మాటలు ప్రజలే అంటే! “ఇక్కడ టీడీపీ గెలుస్తుంది.. రాసిపెట్టుకోండి“ అంటూ.. మహిళలు, పురుషులు కూడా వ్యాఖ్యలు చేస్తే.. చిత్రమే కదా! ఇక, ఆ నియోజకవర్గంలో మార్పు ఖాయమైనట్టే కదా! ఇదే.. ఇప్పుడు వినిపిస్తోంది.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గంలో.
ఇక్కడ దాదాపు 20 ఏళ్ల తర్వాత.. టీడీపీ విజయం సాధించడం ఖాయమనే వ్యాఖ్యలు నియోజకవర్గంలోని సాధారణ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో 1983, 1985 వరుస ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. తర్వాత.. కొంత గ్యాప్ వచ్చినా 1994, 1999లోనూ వరుసగా గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. తర్వాత పార్టీ ఇక్కడ విజయం దక్కించుకోలేక పోయింది. దీంతో వరుసగా నాలుగు ఎన్నికల్లో టీడీపీ ప్రస్తావన ఉన్నా… గెలుపు మాత్రం సాద్యం కాలేదు.
అయితే.. ఇప్పుడు ఈ హిస్టరీని మార్చే ప్రయత్నం సంపూర్ణంగా జరుగుతోందని అంటున్నారు పరిశీలకు లు. ఇక్కడ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న వేగేశ్న నరేంద్ర వర్మ ఏడెనిమిది సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ కోసం చివరి వరకు ట్రై చేసినా చివర్లో చేజారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి పార్టీ ఓడి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్లిపోయినా వర్మ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేసి నియోజకవర్గంలో పార్టీని బతికించుకున్నారు.
నేడు పార్టీ ఇన్‌చార్జ్‌గా ఎంట్రీ ఇచ్చాక వైసీపీ కంచుకోటలో టీడీపీ సైకిల్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు.. పార్టీలకు అతీతంగా ఆయన్ను ఈ రోజు బాపట్ల పొలిటికల్ క్షేత్రంలో హీరోగా నిలబెట్టాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. వేసవిలో వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో అనేక సేవలు అందించారు.
ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటు బ్యాంకు విషయంలో వేగేశ్నకు ఈ సారి చాలా అనుకూలంగా ఉందని అంటున్నారు. ఇక బాపట్ల టౌన్‌లో టీడీపీకి ముందు నుంచి పట్టు ఉంది. ఇక ఇక్కడ పార్టీ నేతలే కాదు.. నియోజకవర్గంలో మహిళలే ఇక్కడ మార్పు ఖాయమని చెపుతుండడంతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సంచలన విజయం నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.