వైసీపీ ఫైర్‌బ్రాండ్లకు చంద్ర‌బాబు మార్క్ చెక్.. ఈ సారి అస్సామే..!

వైసీపీ అధికారంలోకి వచ్చాక..చిన్నాచితక నేతల దగ్గర నుంచి..ఓ స్థాయి ఉన్న నేతలు వరకు..అంతా చంద్రబాబుని తిట్టేవారే. అంటే బాబుని తిడితేనే వైసీపీలో పదవులు నిలబడటం గాని..పదవులు రావడం గాని జరుగుతుంది. అందుకే నేతలు తమని గెలిపించిన ప్రజలని గాలికొదిలేసి..కేవలం బాబుని తిట్టేపనిలో ఉంటున్నారు. అలా తిడుతున్న వారికి జగన్ వద్ద మంచి మార్కులు పడుతున్నాయి గాని, ప్రజల్లో మాత్రం మంచి మార్కులు ఏమి రావడం లేదు.

TD has started new drama to collect funds, says Perni Nani

ఈ క్రమంలో తనని తిట్టే వైసీపీ నేతలకు నెక్స్ట్ ఎన్నికల్లో చెక్ పెట్టడమే టార్గెట్ గా చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఇక బాబుని ఎక్కువ తిట్టే నేతల్లో కొడాలి నాని ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. గత నాలుగు ఎన్నికల నుంచి గుడివాడలో గెలుస్తున్న కొడాలి..గుడివాడకు చేసిందేమి లేదు..పైగా ఈ సారి కూడా గెలిచేస్తాననే ధీమాలో ఉన్నారు. కానీ ఈ సారి ఎలాగైనా కొడాలికి చెక్ పెట్టడమే టార్గెట్ గా బాబు పావులు కదుపుతున్నారు.

కొడాలిపై అభ్యర్ధిని ఫిక్స్ చేసే విషయంలో ఆచి తూచి ముందుకెళుతున్నారు. ఈ సారి ఖచ్చితంగా కొడాలికి చెక్ పెట్టే దిశగానే వెళుతున్నారు. ఇక వెటకారం ఎక్కువ చేసే పేర్ని నానికి ఈ సారి మచిలీపట్నంలో చెక్ పడుతుంది. ఈ సారి పేర్ని పోటీ చేసినా..లేదా ఆయన తనయుడు పోటీ చేసిన ఓడించడం ఖాయమే. అటు పలాసలో సీదిరి అప్పలరాజు, అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా నోరు పారేసుకుంటారో తెలిసిందే.. వీరిని నెక్ట్స్‌ ఎన్నికల్లో ఓడించడానికి టి‌డి‌పి రెడీ అవుతుంది.

Appalaraju Biography, Age, Family, Education, Political Career, and More

అలాగే నగరిలో రోజా, చిలకలూరిపేటలో విడదల రజిని, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్..బాబుని టార్గెట్ చేసి రాజకీయ పబ్బం గడుపుకునే వారందరికి చెక్ పడేలా ఉంద‌న్న చ‌ర్చ‌లు ఏపీ రాజ‌కీయ వర్గాల్లో మొద‌లైపోయాయి. మొత్తానికి నోరు పారేసుకునే నేతలందరికి ఈ సారి చంద్ర‌బాబు మార్క్ చెక్ అయితే మామూలుగా లేదు.