సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్రతి రోజూ పండగే`.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని డిసెంబర్ 20 న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇప్పటికే పలు అప్‌డేట్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్ ద్వారా సినిమాపై హైప్ పెంచేశారు.
ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ బట్టీ చూస్తూ.. తండ్రికి చివరి రోజులు అని తెలిసినా విదేశాల్లో ఉన్న కొడుకులు వచ్చేందుకు ఆలోచిస్తుంటారు. తేజు వారిని ఎలా ఇండియాకు రప్పించాడు.. తాతకు ఎలాంటి సంతోషాన్ని అందించారు అనే అంశాన్ని మారుతి అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు పైగా తేజ్ గత చిత్రం ‘చిత్రలహరి’ హిట్ కావడంతో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందట.
ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు రూ.17 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. సో.. ఈ మొత్తం రికవర్ కావాలంటే సినిమా భారీ హిట్ అవ్వాలి. ఇక తేజ్ గత సినిమా ‘చిత్రలహరి’ వసూళ్లు చూస్తే రూ.13 కోట్ల వరకు టచ్ అయింది. దీన్ని బట్టీ చూస్తే తేజ్ పెద్ద టార్గెట్‌నే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే అదే రోజు బాలయ్య `రూలర్` సినిమా కూడా విడుదల కాబోతుంది. మరి సాయి తేజ్ బాలయ్యను ఢీ కొట్టి తన టార్గెట్‌ను రీచ్ అవుతాడో.. లేదో చూడాలి.