స్టైలీస్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం కంప్యూటర్ పనిలో పడింది. డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు పరుగులు పెడుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా సాగిస్తుంది.
ఈ సినిమాలోని పాటలను ముందుగా విడుదల చేసిన చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ ప్రమోషన్ కార్యక్రమ డోస్ పెంచారు. ఈ చిత్రంలోని మూడు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. ఓ టీజర్‌ను కూడా విడుదల చేసిన దర్శకుడు మరో పాటను విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు సోషల్ మీడియాలో, నెట్టింట్లో హల్‌ఛల్ చేస్తున్నాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే వినిపిస్తున్నాయి. అంతలా పాపులర్ అయ్యాయి ఈ పాటలు. కేవలం మూడు పాటలు విడుదల చేసిన చిత్ర యూనిట్ రికార్డుల మోత మోగిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు..
ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటల్లో సామజవరగమన.. పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటను 113.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక రెండో పాటగా విడుదల చేసిన రాములో రాముల పాట 98.3 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా, ఓమై డాడ్ 10.7 వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటలతో పాటు ఇప్పుడు మరో పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. మరో మాస్ సాంగ్ బుట్టబొమ్మ పాటను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సంగీత దర్శకుడు ఎస్ తమన్ స్వరపరచిన స్వరాలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు రాబోతున్న మాస్ సాంగ్ అభిమానులను ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.