యంగ్ హీరో రాజ్ తరుణ్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే జంటగా నటిస్తున్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పించగా, నిర్మాత శీరిష్ నిర్మించారు. దర్శకత్వం జీఆర్ కృష్ణ వహించారు. ఈ చిత్రంలో ట్రైలర్ 1.57నిమిషాల నిడివితో కట్ చేశారు దర్శకుడు కృష్ణ.
హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ చూస్తే చిననాటి నుంచి కలిసి పరిగిన స్నేహితురాలైన షాలినీ పాండేను ప్రేమించడం.. అందుకు ఆమే ముందుగా నిరాకరించడం.. తరువాత తను ప్రేమలో పడటం.. చూపారు ట్రైలర్‌లో. అయితే ఈ సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలే పెంచుతుంది. ట్రైలర్ ఆసాంతం ప్రేమ, స్నేహం కోసమే సినిమా అని చూపుతుంది.
రాజ్ తరుణ్ కు ప్రస్తుతం ఓ మంచి హిట్ అవసరమైన తరుణంలో దిల్ రాజు ఈ సినిమాను తన బ్యానర్‌లో సమర్పిస్తుండం కలిసొచ్చే ఆంశం. ఈ సినిమా హిట్ కొడితే రాజ్ తరుణ్ కేరీర్‌కు మరోసారి బాటలు పడ్డట్టే. ఇక అర్జున్‌రెడ్డి సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన షాలినీ పాండే ఇప్పుడు రాజ్‌తరుణ్ తో జత కట్టింది. ఈ సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానున్నది.