ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇప్పటికే జనతా గ్యారేజ్ తో వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ హీట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా దేవర కావడం.. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున సినిమా కావడంతో ఈ సినిమాకు వీరిద్దరూ ఎంతగానో కష్టపడుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు ఎన్టీఆర్ – కొరటాల. సినిమా హిట్ అవ్వడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పేరు బైర అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు విలన్ క్యారెక్టర్ లో సైఫ్ అలీ ఖాన్ చేయడంతో ఓ బాడ్ సెంటిమెంట్ గుర్తుతెచ్చుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ఆది పురుషులో కూడా సైఫ్ అలీ ఖానే విలన్‌గా నటించాడు. ఈ సినిమా ఫ్లాప్ అవటం.. ఇదేవిధంగా దేవర సినిమాలో కూడా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిచడంతో ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అన్న చిన్న సందేహం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మొదలైంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా కొరటాల – ఎన్టీఆర్ హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది.