‘ బుజ్జిగాడు ‘ షూటింగ్‌లో చావు అంచుల‌కు వెళ్లి బ‌తికిన ప్ర‌భాస్‌… చాలా ల‌క్కీ అనుకోవాలి..!

రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు.. నటవార‌సుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ప్రభాస్ – త్రిష జంటగా నటించిన బుజ్జిగాడు సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కేఎస్ రామారావు నిర్మించిన సంగతి తెలిసిందే.

Bujjigadu Telugu Movie Poster - 750x500 - Download HD Wallpaper - WallpaperTip

ఈ సినిమాలో డైలాగ్ కింగ్‌ మోహన్ బాబు, సునీల్ లాంటి నటులు కీ రోల్లో నటించారు. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ హిట్ కాక పోయినా ప్రేక్షకుల‌కు బాగా కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీకాకుళం యాసలో.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తాడు ప్రభాస్. బుజ్జిగాడు పాత్రలో తనదైన నటనతో అభిమానులనే కాక చాలామంది సినీ ప్రేమికుల మ‌న‌స్సులు కూడా దోచుకున్నాడు.

Prabhas & MS Narayana Emotional Scene | Bujjigadu Telugu Movie Scenes | Sunil | Puri Jagannadh - YouTube

కథలో ప‌ట్టు లేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు కావడంతో ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర విషయాలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బుజ్జిగాడు సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్‌పై బస్సులో ఫైటింగ్ సీన్ షూటింగ్ చేస్తున్నార‌ట‌. ఆ టైంలో ప్రభాస్ అదుపు జారి బస్ కింద పడిపోయాడట.

Prime Video: Bujjigadu

బస్సు ప్రభాస్ పైనుంచి వెళ్లిపోవడంతో అందరిలోనూ ఒక్క‌టే టెన్ష‌న్‌. ప్రభాస్‌కి ఏం జరిగిందో అని ఆ సినిమా యూనిట్ అంతా బస్సు చుట్టూ గుంపు గూడారట. అదృష్టవ‌శాత్తు ప్రభాస్ కి ఏమి జరగలేదు.. ప్రభాస్ బస్సు మధ్య భాగంలో ఉండడంతో ఆయనకి చిన్న గాయం కూడా కాకుండా తృటిలో బయటపడ్డారు. దీంతో ప్రభాస్ కు చావు తప్పి కన్నులోట్టపోయినట్టు అయింది. దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.