ఈ స్టార్ హీరోలు ఒక‌ప్పుడు సీరియ‌ల‌ హీరోలు అని మీకు తెలుసా… షాకింగ్ ట్విస్టులు..!

సక్సెస్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ? అసలు చెప్పలేం. చిత్ర పరిశ్రమలో అయితే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సక్సెస్ రావాలంటే మాత్రం అది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. ప్రేక్షకులను ఎంత బాగా మెప్పిస్తే అంత క్రేజ్ వస్తుంది. ఈ విధంగా ప్రేక్షకులను మెప్పించి నటులుగా, స్టార్ హీరోలుగా రాంచినవారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా రాత్రికి రాత్రిరే ఎవరూ ఊహించని స్టార్‌డ‌మ్‌ తెచ్చుకున్న‌ స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

ఇక వారిలో చాలామంది బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాతే వెండితెరపై హీరోలుగా అలరిస్తున్నారు.. ఇప్పటికే పలువురు టాప్ హీరోలు కూడా బుల్లితెరను బేస్ చేసుకుని సినిమాల్లో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

When love blossomed between Sushant Singh Rajput and Ankita Lokhande on  Pavitra Rishta sets - India Today

సుశాంత్ సింగ్ రాజ్ పుత్: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మొదటిసారి పవిత్ర రిష్తా పని సీరియల్ ద్వారా తన కెరీర్‌ మొదలుపెట్టి మానవ్ అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే సమయంలోనే అకస్మాత్తు సూసైడ్ చేసుకుని మరణించాడు.

Fauji - Hindi : Shahrukh Khan, Rakesh Sharma, Amina S. Kapoor, Manjula  Avtar, Col. Kapoor, Col. Kapoor: Prime Video - Amazon.com

షారుక్ ఖాన్ :1988 లో దిల్ దారియా అనే డైలీ సీరియల్‌ తో కెరీర్ స్టార్ట్ చేసిన షారుఖ్ ఆ తరువాత ఉన్మీద్, ఫౌజీ, వాగ్లేకి దునియా లాంటి సీరియల్స్ చేసి 1992లో దీవానా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు.

Why we'll always miss Irrfan..

ఇర్ఫాన్ ఖాన్ : దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా 10 టాప్ సీరియల్స్ లో నటించాడు. వాటిలో చాణిక్య, చంద్రకాంత వంటి సీరియల్స్‌లో నటించిన ఈయన హాలీవుడ్‌లో కూడా నటించాడు. బాలీవుడ్ లోకి రోగ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

Actor Yash and Radhika Pandit First Serial Nandagokula Acted together | yash  | radhika pandit - YouTube

యశ్ : కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో కూడా సీరియల్స్ ద్వారానే తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఇక అక్కడే ప్రముఖ సీరియల్ నటి రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

14 Years of Ghajini:- Cinema express

విక్ర‌మ్‌: కోలీవుడ్ టాప్ హీరో విక్ర‌మ్ త‌న సినిమాల‌తో తెలుగులోనూ ల‌క్ష‌ల్లో అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. విక్ర‌మ్ కెరీర్ స్టార్టింగ్‌లో తెలుగులో దూర‌ద‌ర్శ‌న్ సీరియ‌ల్స్‌లో న‌టించాడు. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. వీరే కాకుండా ఎంతోమంది హీరోలు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండితెరపై అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు.