బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తరువాత నటించిన సాహో సినిమాతో కూడా పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుతున్నాడు. అయితే ఇప్పుడు అదే ప్రభాస్ ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోయాడా.. లేక తాను చేస్తున్న జాన్ చిత్రం కోసం తాపత్రయ పడుతున్నాడో తెలియదు కానీ.. టాలీవుడ్ హీరోతో పెద్ద చిక్కు వచ్చింది. అది తన కేరీర్‌కు ప్రమాద సంకేతాలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా ఎదుగుతున్న ఓ కుర్ర హీరోతో పెద్ద చిక్కు వచ్చి పడింది ప్రభాస్‌కు. ఈ కుర్ర హీరోతో వచ్చిన చిక్కుతో కోట్ల రూపాయలకు బొక్క పడుతుండగా, కేరీర్‌కు ప్రమాదం పొంచి ఉన్న దాఖాలాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ఈ కుర్ర హీరో ఎవ్వరనుకుంటున్నా.. అదేనండీ రౌడీ హీరోగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ దర్శకులు, నిర్మాత మనసు దోచుకున్న ఈ రౌడీ హీరోకు ఇప్పుడు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండకు ఇదే ఫైటర్ మూవీని హిందిలో కూడా తీస్తున్నారు. ఈ సినిమాను కరణ్ జోహార్ భారీ స్థాయిలో బాలీవుడ్‌లో తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇక యష్‌రాజ్ ఫిలిమ్స్ ముందుగా ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు సన్నద్దం అయింది. కానీ ప్రభాస్ జాన్ సినిమా కోసం వీటిని వదులుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ విజయ్ దేవరకొండతో సినిమాలు మూడు నాలుగు చేసేందుకు సిద్దమైంది. ఈ సినిమాల కోసం ఇప్పటికే రూ.48కోట్లు విజయ్‌కు ఈ సంస్థ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ వదులుకున్న ప్రాజెక్టులు విజయ్ దేవరకొండకు కాసులు కురిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రభాస్‌కు పంగనామాలు తప్పేలా లేవు అని చిత్ర సీమలో జోరుగా ప్రచారం సాగుతుంది.