ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తోటి హీరోల నడుమ స్నేహ సంబంధాలు బాగా మెరుగు పడుతున్నాయి. గతంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న హీరోలు ఇప్పుడు మాత్రం ఒకరి ఒకరం.. కలిసుంటే కలదు సుఖం అని తమ ఐక్యతను.. స్నేహాన్ని చాటుకుంటున్నారు. అందుకే ఏ హీరో సినిమా విడుదల అయినా ఆ సినిమాను తోటి హీరోలు చూసి ప్రశంసించడం అనవాయితీగా వస్తుంది. ఇది తమ మద్య ఉన్న ఐక్యతకు నిదర్శనంగా.. స్నేహ సంబంధాలకు నిదర్శనంగా చూపుతున్నారు. అలా ఒక హీరో నటించిన సినిమాపై ప్రశంసలు కురిపించి.. శుభాకాంక్షలు చెప్పడంలో ముందుంటాడు ప్రిన్స్ మహేష్‌బాబు.
అయితే ఇప్పుడు ఒక హీరో నటించిన చిత్ర ఈవెంట్లలో ఒక హీరో పాల్గొంటూ అభిమానులకు శాంతి సందేశాలు ఇస్తున్నారు. ఇది గత కొద్ది రోజులుగా బాగా జోరందుకుంది. ఇప్పుడు ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్ర ప్రమోషన్ కార్యక్రమం జనవరి 5న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయింది చిత్ర యూనిట్. ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావాలని మెగాస్టార్ చిరంజీవిని కోరారు ప్రిన్స్ మహేష్‌బాబు. దీనికి ముందుగా మెగాస్టార్ సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి..
అయితే మెగాస్టార్‌కు అనుకోని పనులు ముందుకు రావడంతో ఆయన ఈ మెగా ఈవెంటుకు రావడం లేదని మహేష్‌బాబుకు సమాచారం ఇచ్చాడని టాక్. అయితే మెగాస్టార్ కు బదులు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈసినిమా ఈవెంట్‌కు రాబోతున్నాడని ఫిలింనగర్‌లో వార్త జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని అటు చిత్ర యూనిట్ నుంచి గానీ, ఇటు మెగా పవర్ స్టార్ నుంచి అధికారిక ప్రకటన వస్తే అసలు విషయం తేలిపోతుంది. సో మెగాస్టార్‌కు బదులు మెగా పవర్‌స్టార్ ప్రిన్స్ సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారు అన్నమాట. సరిలేరు నీకెవ్వరూ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. రాబోవు జనవరి 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు.