ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ . పాన్-ఇండియన్ హీరో బ్లాక్ బస్టర్ మూవీ ‘వర్షం ‘ మొదట అక్టోబర్ 23, 2022న విడుదల కావాల్సి ఉంది, కానీ ఎందుకో వాయిదా పడింది.
ప్రభాస్ కి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టిన ఈ సినిమా న్యూ వెర్షన్ నవంబర్ 11, 2022 న రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీఎఫ్‌ఐలో ప్రభాస్ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మేకర్స్ డేట్‌ని కన్ఫర్మ్ చేశారు.
వర్షం చిత్రానికి టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తండ్రి శోభన్ (దివంగత) దర్శకత్వం వహించారు. MS రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో త్రిష, గోపీచంద్, ప్రకాష్ రాజ్, సునీల్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.