కార్తీ ‘సర్దార్’ దర్శకుడుకి కారు గిఫ్ట్

కార్తీ తాజా సినిమా ‘సర్దార్’ టికెట్ కలెక్షన్స్ వద్ద బాగానే ఉంది. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ తమిళం మరియు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ దర్శకుడికి ఒక కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు సంబంధించిన ‘కీ’ల‌ను కార్తీ అందించారు.

రాశి ఖన్నా, లైలా మరియు రజిషా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రిన్స్ పిక్చర్స్ కూడా నిర్మాతగా వ్యవరించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ హిట్ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Tags: hero kaarthi, kaarthi sardar movie, sardar director PS Mithran