Kalyan Ram : బింబిసార ఓటీటీకి వచ్చేస్తుందహో..!

Kalyan Ram Bimbisara OTT Release Date Lock

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట డైరక్షన్ లో వచ్చిన సినిమా బింబిసార. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సూపర్ సక్సెస్ కాగా ఓటీటీ రిలీజ్ కు కొద్దిగా టైం తీసుకున్నారు. రీసెంట్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న బింబిసార సినిమా ఓటీటీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 7న బింబిసార సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది.

కళ్యాణ్ రాం నటన.. వశిష్ట డైరక్షన్ కలిసి సినిమాని ఈ రేంజ్ లో హిట్ చేశాయి. ఈ సినిమాతో పాటుగా వచ్చిన సీతారామం కూడా హిట్ అవగా.. ఆ సినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజైంది. కానీ బింబిసార మాత్రం ఓటీటీ రిలీజ్ లేట్ చేశారు. ఇక ఫైనల్ గా జీ 5 లో అక్టోబర్ 5న బింబిసార రిలీజ్ అవుతుంది. థియేటర్ లో మిస్సైన ఆడియన్స్ తప్పకుండా జీ 5 ఓటీటీలో బింబిసార సినిమా చూస్తారని చెప్పొచ్చు.

బింబిసార పార్ట్ 2 కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఎన్.టి.ఆర్ కూడా పార్ట్ 2లో కెమియో రోల్ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా చూసిన బాలయ్య బాబు కూడా చిత్రయూనిట్ ని మెచ్చుకున్నారు. మరి థియేటర్ లో సక్సెస్ అయిన బింబిసార ఓటీటీలో కూడా అదే రిజల్ట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. బింబిసార సినిమాలో సంయుక్త మీనన్, కేథరిన్ త్రెసా హీరోయిన్స్ గా నటించారు.

Tags: Bimbisara, Bimbisara OTT, Kalyan Ram, Tollywood, Vashishta, Zee 5