ప్రభాస్ “ప్రాజెక్ట్-కె” రిలీజ్ డేట్ లాక్ !

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్-టు-బ్యాక్ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మరియు ప్రాజెక్ట్-కె అతని కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

ఇటీవలి ఇంటర్వ్యూలో, చిత్ర నిర్మాత అశ్వినీ దత్ జనవరి 2023 చివరి నాటికి సినిమా ముగుస్తుందని, పోస్ట్ ప్రొడక్షన్ మరియు VFX పనులు మరో 8 నెలలు పడుతుందని వెల్లడించారు. అక్టోబర్ 18, 2023న అంటే ప్రభాస్ పుట్టినరోజుకు ఒక వారం ముందు సినిమా విడుదలవుతుందని ఆయన అన్నారు. కాకపోతే 2024 జనవరిలో సినిమా విడుదలవుతుందని నిర్మాత తెలిపారు.

ప్రాజెక్ట్-కె గురించి అశ్విని దత్ మరింత మాట్లాడుతూ ఈ చిత్రం ప్రభాస్‌ను సూపర్ హీరో తరహా పాత్రలో కనబడుతాడని అంతే కాకుండా అమితాబ్ బచ్చన్ మునుపెన్నడూ లేని పాత్రలో కనిపిస్తారని అన్నారు. ఈ సినిమా సంచలనంగా మారుతుందని అశ్వినీదత్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ త్వరలో విడుదల కానున్నాయి.

Tags: director naga aswin, Prabhas, producer swini dutt, project k movie