కళ్యాణ్ రామ్ “బింబిసార” సెన్సార్ రిపోర్ట్ !

టాలీవుడ్ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి భారీ చిత్రం బింబిసార ఆగస్ట్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. వశిస్ట్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌లో కేథరిన్ థ్రెసా మరియు సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటించారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా రన్‌టైమ్ 146 నిమిషాలు. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రంలో వారిన హుస్సేన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి పాటలు సమకూర్చారు.

Tags: bimbisara movie censor report, Kalyan Ram, tollywood news