అక్కినేని ఇంటి నుంచి మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌..?

తెలుగు చిత్ర‌సీమ‌లో అక్కినేని పోషించిన పాత్ర లేనిది. అద్వితీయ‌మైన న‌ట‌న‌తో, అపురూప చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. తుది శ్వాస వ‌ర‌కు సినిమాల‌కే అంకిత‌మ‌య్యారు. రోమాంటి సినిమాల‌తో పాత త‌రాన్ని ఊర్రూత‌లూగించారు. అంతేకాదు త‌మిళనాడు నుంచి హైద‌రాబాద్‌కు తెలుగు చిత్ర సినిమా త‌ర‌లిరావ‌డంలో కీల‌క భూమిక‌ను పోషించారు. అందులో భాగంగా మొద‌ట‌గ త‌నే అన్న‌పూర్ణ పేరుతో సొంత నిర్మాణ సంస్థను, స్టూడియోని నిర్మించారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించి తెలుగు చిత్రాల ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేశారు. ఇక ఆయ‌న వార‌సుడిగా అడుగుపెట్టినా అక్కినేని నాగార్జున త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నారు. తండ్రి స్థాపించిన స్టూడియో పేరును మ‌రింత పైకి తీసుకెళ్లాడు. యువ ద‌ర్శ‌కులు, న‌టీన‌టుల ప్ర‌తిభ‌ను గుర్తించి వారికి అవ‌కాశాల‌ను క‌ల్పించారు. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటరప్రైజెస్ బ్యానర్‌‌ను ప్రారంభించాడు.

ఇదిలా ఉండ‌గా అక్కినేని కుటుంబం నుంచి మ‌రో కొత్త బ్యాన‌ర్ ఏర్పాటు కానుంద‌ని టాలివుడ్ టాక్‌. అక్కినేని నాగార్జున వార‌సుడిగా ఇండ‌స్ర్టీలో అడుగుపెట్టిన నాగ‌చైతన్య కేరీర్‌లో ఇప్పుడిప్పుడే నిల‌దొక్కుకుంటున్నాడు. ఇటీవ‌లే స‌వ్య‌సాచి, మ‌జిలీ త‌దిత‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను అందుకున్నాడు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా పేరును నిల‌బెట్టుకున్నాడు. ఇదిలా ఉండ‌గా తండ్రి బాట‌లోనే త్వరలో సొంత బ్యానర్‌ను స్థాపించాల‌నే యోచ‌న‌లో చైతు ఉన్నాడ‌ట‌. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, టాలెంట్‌ను ప్రోత్స‌హిస్తూ తన బ్యానర్‌లో వరసగా సినిమాలను నిర్మించాలని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాడ‌ట‌. అయితే ఇప్ప‌టికే తండ్రి నాగార్జున స్టార్ట్ చేసిన ఓన్ బ్యానర్‌ ఉండగా.. నాగ చైతన్య కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించడంపై ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అందులోని ఆంత‌ర్యం ఏమిటో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాలి మ‌రి.

Tags: akkineni nagarjuna, annapurna studio, great india banner, Naga Chaitanya