చిరంజీవి, మహేష్‌బాబు రిజెక్ట్ చేసిన సినిమాలో ప్రభాస్.. షాకింగ్ రిజ‌ల్ట్‌…!

కృష్ణంరాజు నట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు. చిరంజీవి, మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథలో ప్రభాస్ న‌టించాడు. ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతాం. ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసిన కథను మరో హీరో చేయడం సాధారణం.

Prabhas, Asin-starrer Chakram Completes 17 Years of Release

అలా మొదటి చిరంజీవి కోసం రాసిన కథను ఏవో కారణాలు చేత చిరంజీవి రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబుకు వినిపించగా మహేష్ బాబు కూడా రిజెక్ట్ చేశాడట. చివ‌ర‌కు ఆ సినిమాలో ప్రభాస్ న‌టించి బోర్లా ప‌డ్డారు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా ? చ‌క్రం. ఆశిన్, ఛార్మీ హీరోయిన్లుగా ప్రభాస్ హీరోగా వచ్చిన చక్రం. ఈ సినిమాతో ప్రభాస్ కి మంచి గుర్తింపు వచ్చినా కమర్షియల్ గా హిట్ అవ్వ‌లేదు.

ఈ సినిమాలో ప్రభాస్ క్యాన్సర్ పేషంట్ గా కనిపిస్తాడు. అతడికి క్యాన్సర్ ఉందని తెలిసినా సరే ఆ చేదు విషయాన్ని దిగమింగుకొని అందరి ముఖాల్లో నవ్వులు నింపాలని ప్రయత్నించే యంగ్ డాక్టర్ రోల్‌లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమాలో హీరో రోల్ ని చంపేయడం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు ప్రేక్షకులు కూడా హీరో రోల్ చనిపోవడం జీర్ణించుకోలేకపోయారు.

Watch Chakram Full Movie Online for Free in HD Quality | Download Now

దీంతో ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. అయితే ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమైతే చాలామంది చూస్తూనే ఉంటారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా నంది అవార్డు రావడం విశేషం. అప్ప‌ట్లో ఈ సినిమా ప్లాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీగా నష్టం వచ్చిందట. అయితే ఈ సినిమాకు ప్రేక్ష‌కుల ప్ర‌శంసుల వ‌చ్చాయి.