ప‌విత్ర‌తో పెళ్లే కాదు పిల్ల‌లు కూడా… న‌రేష్‌కు ఆ కోరిక ఇంకా చావ‌లేదా…!

నరేష్ – పవిత్ర ప్రస్తుతం ఈ పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.. ఇద్దరికి పెళ్లి అయిపోయిందంటూ.. అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. మళ్లీ పెళ్లి అనే సినిమాతో తెరపైకి రాబోతున్న ఈ జంట ఎప్పటికప్పుడు ఈ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాపై హైప్‌ పెంచడంతోపాటు వారి జీవితంలోని ప‌ర్స‌న‌ల్‌ విషయాల‌పై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

Actor Naresh VK, Pavitra Lokesh, MS Raju's Telugu-Kannada bilingual film Malli Pelli' / 'Matthe Madhuve' teaser unveiled | Telugu Movie News - Times of India

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో దివంగత నటుడు శరత్ బాబు, అన్నపూర్ణ, అనన్య నాగళ్ళ వంటి ఎంతోమంది కీలకపాత్రల‌లో నటించారు. అయితే కన్నడ, తెలుగు భాషల్లో మే 26న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అసలు విషయానికి వ‌స్తే గతంలో నరేష్ – పవిత్ర లిప్ కిస్ పెట్టుకున్న ఫోటో నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్‌గా మారింది. లేటు వయసులో ప్రేమలో ప‌డిన ఈ జంట యంగ్ క‌పుల్ నానా హంగామా చేస్తున్నారు.

Read all Latest Updates on and about Pavitra Lokesh

తాజాగా మ‌ళ్లీపెళ్లికి సినిమా ఇంటర్వ్యూలో పెళ్లి, పిల్లల గురించి ప్రశ్న అడగగా నరేష్ బోల్డ్ కామెంట్స్ చేశారు. పెళ్లయిన తర్వాత పిల్లల్ని కంటారా..? అని నరేష్‌ను ప్ర‌శ్నిస్తే షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటివరకు పిల్లల గురించి ఆలోచించలేదని.. కానీ పెళ్లయిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచిస్తామని.. స్వచ్ఛమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అది పిల్లల విషయంలోనూ వర్తిస్తుంద‌ని చెప్పాడు.

Pavitra Lokesh and Naresh New Movie Malli Pelli Release Trailer | Daily Culture - YouTube

ఇక పెళ్లి తర్వాత పిల్లల్ని కూడా కనాలనిపిస్తే కంటాం అంటు నరేష్ చెప్పుకువచ్చాడు. దీంతో నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింటే వైరల్ అవుతున్నాయి. ఈ వ‌య‌స్సులోనూ న‌రేష్‌కు ఈ కోరిక తీర‌లేదే అని కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం ప‌విత్ర‌తో పెళ్లి త‌ర్వాత వీరి కాపురంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో చూద్దాం.