బ్రో మూవీ పోస్టర్లో పవన్ కళ్యాణ్ షూస్ చూశారా… రేటు చూస్తే క‌ళ్లు తేలేయాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ బ్రో. తమిళ్ డైరెక్టర్ సముద్రఖ‌నీ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తుండ‌గా.. పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. వినోదయ సీతం అనే త‌మిళ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్ర పోషిస్తుండ‌గా… యాక్సిడెంట్ లో చనిపోయి మళ్ళీ బతకాలని వరం పొందిన యువకుడిగా సాయిధరమ్ తేజ్ కనిపించబోతున్నాడు..

Bro': Sai Dharam Tej's first look from film with Pawan Kalyan out - The Hindu

ఈ సినిమా నుంచి రివీల్ అయిన ఏ పిక్ అయినా బాగా వైరల్ అవుతోంది. సాయి ధరంతేజ్ కుర్చీలో కూర్చోగా.. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ పై చేయి వేసి మాట్లాడుతున్న స్టిల్ మామూలుగా లేదు. ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమా మోషన్ పోస్టర్‌కు కూడా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అప్డేట్స్ వస్తే చాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు.. చాలామంది ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక‌ ఈ సినిమా జులై 28 రిలీజ్ కానుంది. ఇప్పటికే బిజినెస్ కూడా ప్రారంభమైపోయింది. పవన్ కళ్యాణ్ బ్రో మోషన్ పోస్టర్లో ఒక పవర్ఫుల్ స్టిల్ లో కనిపించాడు. ఈ మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ధరించిన కాస్ట్యూమ్ తో పాటు అతని షూస్ కూడా చాలామందిని అట్రాక్ట్ చేశాయి. వాటి ఖరీదు ఎంత ఉంటుందో అని కొంతమంది ఆన్లైన్లో విప‌రీతంగా సెర్చ్ చేశారు.

Bro movie motion poster record// OY Entertainment - YouTube

పవన్ కళ్యాణ్ ధరించిన ఈ షూస్ ధర 1185 అమెరికన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలు దాదాపుగా లక్ష రూపాయల విలువ చేస్తాయి. దాంతో షూస్ కే లక్ష రూపాయలా అంటూ సినీ జ‌నాలు క‌ళ్లు తేల‌స్తుంటే.. ప‌వ‌న్ రేంజ్‌కు ఆ మాత్రం షూస్ ఉండాల‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.