‘ ఆదిపురుష్ ‘ ర‌న్ టైం… ప్ర‌భాస్ పెద్ద టెన్ష‌న్ పెట్టేశాడుగా…!

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‌ దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ సినిమాలలో ఒకటైన ఆదిపురుష్ పై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం భారతీయ సినిమా తెర‌పై భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వ‌చ్చే నెల 16న రిలీజ్ అవుతోన్న ఈ బిగ్గీ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

Adipurush (2023) - News - IMDb

అలా రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అలాగే, ప్రభాస్ రామ్ అవతారం గెటప్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌గా ఈ సినిమాపై అంచ‌నాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ కాగా లేటెస్ట్ గా ఈ సినిమా టోటల్ రన్ టైంపై ఓ వార్త వైర‌ల్‌గా మ‌రింది. ఈ సినిమా ర‌న్ టైం ఏకాంగా మూడు గంట‌ల నిడివి వ‌చ్చేసింద‌ట.

సినిమా మొత్తం ర‌న్ టైం 2 గంటల 54 నిమిషాల నిడివి వచ్చినట్టుగా ఓవర్సీస్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. అంటే మొత్తం 174 నిమిషాలు. ఈ ర‌న్ టైం సినిమా బాగుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ బాగోలేకపోతే మాత్రం తప్పకుండా ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై పడుతుంది. ప్ర‌భాస్ గ‌త సినిమాలు కూడా ఇంతే ర‌న్ టైమ్‌తో వ‌చ్చి ఫ్లాప్ సినిమాలుగా నిలిచ్చాయి.

Boycott Adipurush Trends On Social Media After Its Teaser Receives Massive  Backlash, Netizens Say “Bollywood Converted The 'Gracefulness' Of Arrogant  Ravana…”

ఇప్పుడు ఆదిపురుష్‌ సినిమా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాక‌పోతే ప్లాప్ అవుతుంద‌నే అనుమాలు కూడా ఉన్నాయి. బాహుబ‌లి సినిమాల లాగా ఈ సినిమా ఉంటే ప్ర‌భాస్ క్రేజ్ మ‌రో లెవ‌ల్‌కు వెళుతుంది అని చెప్ప‌డంలో అతిశయోక్తి లేదు. ఏదేమైనా ఆదిపురుష్ ర‌న్ టైం బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను పెద్ద టెన్ష‌న్‌లో ప‌డేశాడు.