మహేష్ – నమ్రత మధ్య ఏజ్ గ్యాప్‌లో ఈ ఈ ట్విస్ట్ చూశారా..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ప్రేమ‌, పెళ్లి పెద్ద సంచ‌ల‌నం. వీరి పెళ్లి జ‌రిగే టైంకు అస‌లు వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్టే చాలా మందికి తెలియ‌దు. వీరి నేప‌థ్యాలు వేరు.. వీరి భాష‌లు వేరు. వీరి ప్రాంతాలు వేరు. అయినా మ‌న‌స్సులు క‌ల‌వ‌డంతో వీరు ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. కేవ‌లం 2000లో వ‌చ్చిన వంశీ సినిమాలో మాత్ర‌మే వీరు జంట‌గా న‌టించారు.

Namrata Shirodkar & Mahesh Babu Trend After They Share A Loved Up Picture

ఆ సినిమా కూడా స‌రిగా ఆడ‌లేదు. అయితే ఆ సినిమా షూటింగ్ కోసం ద‌ర్శ‌కుడు బి. గోపాల్ ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు సుధీర్ఘ‌మైన షెడ్యూల్ ప్లాన్ చేశారు.అప్పుడే మ‌హేష్‌, నమ్ర‌త మ‌ధ్య ప్రేమ చిగురించి నాలుగేళ్ల‌కు పైగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మామూలుగా వీరి ప్రేమ చిగురించే టైంకు న‌మ్ర‌త బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్. అప్ప‌టికే ఆమెకు పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు వ‌చ్చాయి.

It's magical how Mahesh Babu and I found a home in each other: Namrata  Shirodkar | Telugu Movie News - Times of India

సంజ‌య్‌ద‌త్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్ లాంటి వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసింది. ఆమె మాజీ మిస్ ఇండియా. ఆమె సోద‌రి శిల్పా శిరోద్క‌ర్ కూడా హీరోయిన్‌.. ఆమె తెలుగులో మోహ‌న్‌బాబు హీరోగా వ‌చ్చిన బ్ర‌హ్మ సినిమాలో నటించింది. అయితే న‌మ్ర‌త- మ‌హేష్ మ‌ధ్య నాలుగేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. వ‌య‌స్సులో మ‌హేష్ కంటే న‌మ్ర‌తే పెద్ద‌. మహేష్ 1975లో జన్మించగా వీరి మధ్య నాలుగేళ్ళ వయసు వ్యత్యాసం ఉంది.

10 sweet throwback pics of Mahesh Babu, Namrata Shirodkar | Times of India

ప్రస్తుతం నమ్రత వయసు 48ఏళ్ళు కాగా, మహేష్ కి కేవలం 44 సంవత్సరాలే. సెలెబ్రిటీ వివాహాలలో ఇది కామన్ విషయం. ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. అలాగే చాలా ఏజ్ గ్యాప్ ఉన్న అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో ఉన్నారు. లెజెండ్ సచిన్ తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని చేసుకున్నారు. మహేష్ అభిప్రాయాలను గౌరవించే నమ్రత ఇద్దరు పిల్లలకు తల్లిగా, మహేష్ మేనేజర్ గా ఉంటూ ఆయన సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.