నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే కొన్ని గంటల ముందుగానే అమెరికా, ఓవర్సీస్‌లో చిత్రం ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య నటన.. స్టైల్స్.. ఇతర నటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రిమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్వీట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు. ఓ సారి మనం ఆ ట్వీట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నందమూరి బాలకృష్ణ నటనతో ఇరగదీశాడు. రెండు వేరియన్స్‌తో రాణించాడు. పోలీసాఫీసర్‌గా.. బిజినెస్ మెన్‌గా బాలకృష్ణ విభిన్నమైన నటన చూపాడు. బాలయ్య స్టైల్స్ అదిరిపోయాయి. యంగ్ హీరోలకు దీటుగానే బాలయ్య రాణించాడనే టాక్. దర్శకుడు కేఎస్ రవికుమార్ గత చిత్రం జై సింహా సినిమా కన్నా ఈ సినిమాలో బాలయ్యను ఫవర్‌ఫుల్‌గా చూపాడు. జై సింహా కన్నా రూలర్ సినిమాపై పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. బాలయ్య బిజినెస్‌మెన్ పాత్ర కన్నా పోలీసాఫీసర్ పాత్రలోనే రాణించాడు.
బాలయ్య బిజినెస్‌మెన్‌గా కొత్త కోణంలో కనిపించారు. బిజినెస్‌మెన్‌గా కొత్త స్టైల్.. కొత్త లుక్ తో అదరగొట్టినప్పటికి బాలయ్య నుంచి అభిమానులు కోరుకునేది మాత్రం పోలీసాఫీసర్ పాత్ర ద్వారానే చూపించారు దర్శకుడు. బాలయ్య డైలాగ్ డెలివరిలో తేడా లేనప్పటికి.. బాలయ్య రొమాన్స్‌ను మాత్రం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ముదిరిన బాలయ్య పక్కన లేత బామలతో రొమాన్స్ చూడటానికి ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపిస్తుందనే సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. ఇందులో జయసుధ, భూమిక, ప్రకాశ్‌రాజ్ నటన హైలెట్‌గా నిలుస్తుంది.
బాలయ్య సినిమాలు అంటేనే వన్‌మ్యాన్ షో అనేది మనకు ముందు నుంచి తెలిసిందే. ఈ సినిమాలోనూ కూడా యథాతధంగానే వన్‌మ్యాన్ షోతో సినిమాను లాక్కొచ్చారు దర్శకుడు కేఎస్ రవికుమార్. సినిమా మొదటి భాగం కొంత మంచిగానే ఉన్నప్పటికి రెండో భాగమంతా ప్రేక్షకులను నిరాశే పరిచిందని.. డైలాగ్‌లు సూపర్‌గా ఉన్నా.. యాక్షన్‌తో ఇరగదీసినప్పటికి ఇది బాలయ్య అభిమానులకు తప్ప సాధారణ ప్రేక్షకులను మెప్పించలేక పోయిందని ట్వీట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు సాధారణ ప్రేక్షకులు.