ప్రభాస్ తన సినిమాలు హిట్ అవ్వటం కోసం అలాంటి పనులు చేస్తాడా.. బయటపడ్డ ఎవరికీ తెలియని సీక్రెట్..!

ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇదే సమయంలో ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర కూడా ప్రభాస్‌కు స్టార్డం తెచ్చిపెట్టలేదు. ఎప్పుడైతే వర్షం సినిమా వచ్చిందో ఆ సినిమాతో ప్రభాస్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలా వర్షం సినిమాతో వచ్చిన స్టార్డంని ప్రభాస్ క్రమం తప్పకుండా పెంచుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.

Happy Birthday Prabhas: 10 hottest moments of the 'Baahubali' actor that will have you swooning in no time

ఇదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛ‌త్రపతి సినిమా ప్రభాస్ కి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అప్పటినుంచి ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారిపోయాడు. అదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన బాహుబలి సీరిస్‌ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Prabhas wraps up first schedule of Maruthi's Raja Delux : Bollywood News - Bollywood Hungama

గతంలో ప్రభాస్ నటించిన వరుస సినిమాలో ప్లాఫ్ అవడంతో ఆయన జాతకంలో ఏదో దోషం ఉందని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పిన మాటలు విని ఆయన సినిమాలు హిట్ అవ్వాలని పరిహార పూజలు చేశారట. అలా ఆయన ఎప్పుడైతే సినిమాల‌ విజయం కోసం ఆ పూజలు చేశారో ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇలా పెద్దమ్మ మాటలు విని ప్రభాస్ చేసిన పూజలు ఆయనకు మంచి ఫలితాన్ని ఇచ్చాయి.

Prabhas to unleash his dark side in Salaar | Filmfare.com

అయితే ఇప్పుడు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఇక ప్రస్తుతం ప్రభాస్ జాతకం బాగోలేదని వస్తున్న వార్తల నేపథ్యంలో మళ్లీ ప్రభాస్ పూజలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక మరి ప్రభాస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.