బరువు తగ్గని ప్రభాస్..ఆ దర్శకుడు సీరియస్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారుండరు.. ప్రభాస్ పర్సనాలిటీకి అమ్మాయిలైతే పడిచచ్చిపోతారు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే బాహుబలి సినిమా కోసం ప్రభాస్ బరువు పెరిగాడు.. ఆ తర్వాత ప్రభాస్ తన బరువును తగ్గించుకోలేకపోతున్నాడు. బాహుబలిలో ఎంత బరువు ఉన్నాడో.. దాదాపు అంతే బరువుతో కనిపిస్తున్నాడు.

బాహుబలి తర్వాత రెండేళ్లు గ్యాస్ తీసుకొని సాహోతో ముందుకొచ్చాడు ప్రభాస్. ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన రాధ్యేశ్యామ్ కూడా నిరాశపరిచింది. అయితే ఈ సినిమాల్లో ప్రభాస్ లుక్ పై ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే బాహుబలి సినిమా కోసం బరువు అయితే పెరిగాడు.. కానీ దానిని తగ్గించుకోలేకపోతున్నాడు. ప్రభాస్ కి ఫిజిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. సాహో, రాధ్యేశామ్ సినిమాల్లో ప్రభాస్ లుక్ కోసం సీజీ వర్క్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.. ప్రభాస్ కెరీర్ కి బరువు పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రభాస్ కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు.. వీటిలో ‘సలార్’ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. దీంతో ప్రభాస్ తన ఫిజిక్ మెయిన్ టెయిన్ చేసుకోలేకపోతున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో తన బాడీని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడం కష్టం అవుతుందట.. వరుస షూటింగ్ లతో ప్రభాస్ లుక్ కూడా మారిపోతుందట. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే యాక్షన్ సీన్లలో ప్రభాస్ కి బదులుగా ఒక డూప్ ని తీసుకున్నట్లు సమాచారం.. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags: Prabhas, Prashanth Neel, Tollywood, weight gain