Prabhas : సంక్రాంతికే ఆదిపురుష్.. ఆ రెండు సినిమాలతో ఫైట్..!

Prabhas Big Fight between These Three Movies

Prabhas : ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. రావణుడిగా సైఫ్ అలి ఖాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2023 సంక్రాంతికి ఆల్రెడీ రెండు భారీ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.

ఇప్పటికే దళపతి విజయ్ వారసుడు సినిమా రిలీజ్ ప్లాన్ చేయగా ఆ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి వాళ్తేర్ వీరయ్య సినిమా కూడా రిలీజ్ అవనుంది. ఆదిపురుష్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా ఏదైనా సరే నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఆదిపురుష్ వల్ల వీరయ్య, వారసుడు సినిమాలకు ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. ఈ 3 సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. అయితే ఏ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి. తెలుగులో చిరు సినిమాకు, ప్రభాస్ సినిమాకు ఒకేరకమైన క్రేజ్ వస్తుంది. అయితే విజయ్ వారసుడు సినిమాకే తక్కువ స్కోప్ ఉంటుంది. మరి ఈ మూడు సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుంది అన్నది చూడాలి.

Tags: Aadipurush, Prabhas, Tollywood, Valtair Veerayya, Varasudu