Balakrishna : అన్ స్టాపబుల్ గెస్ట్ గా చంద్రబాబు..!

Chandrababu in Balakrishna Unstoppable Show

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రియాలిటీ షోస్ తో కూడా కుమ్మేస్తున్నాడు. బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో సీజన్ 1 అదరగొట్టింది. రియాలిటీ షోల్లో రారాజుగా అన్ స్టాపబుల్ నిలిచింది. ఇక ఇప్పుడు ఆ షో సెకండ్ సీజన్ రెడీ అవుతుంది. సీజన్ 2 కోసం ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ స్టామినా గురించి చెబుతూ వచ్చిన ఆ సాంగ్ అదిరిపోయింది. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 స్పెషల్ గెస్టులతో సర్ ప్రైజ్ చేయనున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది.

అన్ స్టాపబుల్ సీజన్ 2 షోలో చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఇద్దరు వియ్యంకులు కలిసి అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు ఇద్దరు కలిసి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం టీడీపీ పార్టీ నేతలకు సర్ ప్రైజ్ కానుంది.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఎన్.బి.కె 107 సినిమా సెట్స్ మీద ఉంది. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రాక్ తో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో అదే రేంజ్ మాస్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ దసరాకి చేస్తారని అంటున్నారు.

Tags: Chandrababu in Balakrishna Unstoppable Show