ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‘ బ్రో ‘ బిజినెస్ క్లోజ్‌… అప్పుడే అన్ని కోట్ల లాభాలా…!

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టార్ మూవీగా బ్రో సినిమా తెర‌కెక్కుతోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. బ్రోలో సాయిధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం ప‌వ‌న్ దాదాపు 20 నుంచి 25 రోజులు వర్క్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ దాదాపు 50 కోట్లు.

ఈ సినిమా తమిళంలో వచ్చిన వినోదయ సీతం సినిమాకు రీమేక్. దర్శకుడు త్రివిక్రమ్ రైటర్ సాయి మాధవ్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి టాలీవుడ్లో పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా ఆయన పాత్రను మలిచారు. ఈ సినిమా నిర్మించేందుకు పీపుల్స్ మీడియాకు దాదాపు 125 కోట్ల వరకు ఖర్చయింది. ఇక నాన్ థియేట్రిక‌ల్ రైట్స్, థియేట్రిక‌ల్ రైట్స్ కలిపి రు. 175 కోట్లకు బిజినెస్ జ‌రిగింద‌ట‌.

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్‌ కావడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు భారీ మొత్తంలో ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 50 కోట్ల లాభాలు పీపుల్స్ మీడియా క‌ళ్ల చూసిందంటున్నారు.

ఈ సినిమా హిట్ అయితే రు. 200 కోట్ల కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఎక్కువగా ఉండడంతో నిర్మాతలకు మరో 50 కోట్ల లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు. దీంతో 100 కోట్ల లాభాలు ఒక్క బ్రో సినిమాతోనే పీపుల్స్ మీడియా ఖాతాలో పడబోతున్నాయి అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.