అనుపమకు ఉన్న ఆ చిన్న మైన‌స్ వ‌ల్లే స్టార్ హీరోలు ఆమెను ప‌క్క‌న పెట్టేశారా…!

ఆనుప‌మ‌ పరమేశ్వరన్ టాలీవుడ్ ఓ మోస్త‌రు పాపుల‌ర్ హీరోయిన్‌. అనుప‌మ‌ నటించిన ఎక్కువ‌ సినిమాలు సూపర్ హిట్ కావడంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో పాటు డాన్స్ తో కూడా అందరినీ అలరించే అనుపమ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె నటించిన అన్ని సినిమాలు సక్సెస్ అయినా స్టార్ హీరోల‌ పక్కన ఆమెకు ఛాన్స్ రావ‌డంలేదు.

అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఒక‌టి ఉంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉన్నాయి. అనుపమకు చాలా పొగరు అని… అందుకే స్టార్ హీరోస్ ఆమెకు అవకాశం ఇవ్వడం లేద‌ని అంటూ ఉంటారు. అసలు విషయానికి వస్తే అనుపమ షూటింగ్లో అయినా.. నిజ జీవితంలో అయినా ముక్కుసూటిగా ఉంటుందట. తన మనసుకు అనిపించింది మొఖం మీద చెప్పేస్తుందట. ఎదుటివారు దానిని ఎలా ? తీసుకుంటారు… ఎలా ఫీలవుతార‌న్న‌ది ఆమె ఆలోచించదట‌.

దీంతో అనుపమ బిహేవియర్ నచ్చని చాలామంది హీరోలు, డైరెక్టర్లు కూడా ఇబ్బంది పడ్డారని టాక్. దీంతో అనుపమకి చాలా కోపం ఎక్కువ అని.. తన బిహేవియర్.. తన పొగరుబోతు తనం వల్లే స్టార్ హీరోలు ఆమె వైపు చూడడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ వ్యక్తిపై ఉన్న ఒపీనియన్స్ అయినా చెప్పే విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటానని తెలిపింది.

నాకు ఏదైనా నచ్చకపోతే మొఖం మీదే చెప్పేస్తానని.. మన లైఫ్ చాలా చిన్నది.. ఇక్కడ ఉండేది కొన్నాళ్ళు మాత్రమే.. మళ్ళీ వెళ్ళిపోతాం.. ఆ రోజు ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి బతికి ఉన్న కొద్ది కాలమైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఒత్తిడి దాచుకోకుండా ఉంటాన‌ని… అలా ఒత్తిడి దాచుకొని నా శక్తిని వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేద‌ని చెప్పింది. అందుకే ఏదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేసి అక్కడికక్కడే మర్చిపోతాను అంటూ చెప్పుకొచ్చింది అనుప‌మ‌.