9 ఏళ్లుగా జబర్దస్త్ యాంకర్ గా తన పాపులారిటీ పెంచుకుంటూ వచ్చిన అనసూయ ఆ షోని వదిలిపెట్టి వెళ్లిన విషయం తెలిసిందే. పూర్తిగా ఇక సినిమాల మీద ఫోకస్ పెట్టే ఆలోచనతో అనసూయ జబర్దస్త్ (Jabardasth) కి టైం కేటాయించలేకపోతుంది. అందుకే ఆమె కూడా జబర్దస్త్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. ఇప్పటికే జబర్దస్త్ నుంచి సుధీర్ కూడా బయటకు రావడంతో ఆ షో మీద మరింత ఇంప్యాక్ట్ పడింది. ఇక జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరు అనే ఎక్సయిట్ మెంట్ ఆడియెన్స్ లో ఉంది.
ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రష్మి గౌతం యాంకర్ గా కొనసాగుతుంది. అయితే జబర్దస్త్ కి కొత్త యాంకర్ అంటూ ప్రోమో వదిలారు. తీరా నిన్న ఎపిసోడ్ లో జబర్దస్త్ యాంకర్ ని రివీల్ చేశారు. కొత్త జబర్దస్త్ యాంకర్ ని చూసి ఆడియెన్స్ మాత్రమే కాదు కమెడియన్స్ కూడా షాక్ అయారు. కొత్త యాంకర్ అంటూ ఊరించి చూపించి ఫైనల్ గా చీర కొంగు చాటు నుంచి ఆమెని రివీల్ చేశారు. ఇంతకీ జబర్దస్త్ (Jabardasth) కొత్త యాంకర్ ఎవరో తెలుసా.. ఇంకెవరు రష్మినే.
అంతకుముందు అనసూయకి బదులుగా కొన్ని ఎపిసోడ్స్ రష్మి జబర్దస్త్ కి యాంకర్ గా చేసింది. ఆ తర్వాత ఆమెకి క్రేజ్ రావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ పెట్టి రష్మిని అక్కడకి షిఫ్ట్ చేశారు. జబర్దస్త్ కి అనసూయ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మి ఈ ఇద్దరు అలా ఫిక్స్ అయ్యారు. అయితే అనసూయ ఎగ్జిట్ అవడంతో ఇప్పుడు జబర్దస్త్ కి ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మినే సోలో యాంకర్ అయ్యింది. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడా ఉంటా అన్నట్టు అక్కడ యాంకరింగ్ చేస్తా ఇక్కడ యాంకరింగ్ చేస్తా అంటుంది రష్మి.