Krithi Shetty : కృతి శెట్టిని చూసి మిగతా హీరోయిన్స్ నేర్చుకోవాలి.. బేబమ్మా నువ్వు సూపరమ్మా..!

ఉప్పెన సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న కృతి శెట్టి సినిమాలో నటించడమే కాకుండా సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా బాగా కోపరేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆగష్టు 12న మాచర్ల నియోజక వర్గం వరకు Krithi Shetty నటించిన 4 సినిమాలకు కృతి శెట్టి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసింది. రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వేటికి ఆమె మిస్ అవకుండా వచ్చింది. మొన్నటిదాకా రామ్ ది వారియర్ సినిమా కోసం ప్రమోషన్స్ చేసిన కృతి ఇప్పుడు నితిన్ సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

కొత్త హీరోయిన్ అందులోనూ ప్రమోషన్స్ కూడా కొత్తైనా సరే ఏమాత్రం విసుగు లేకుండా ప్రతి సినిమాకు తన వరకు అయినంత ప్రమోషన్స్ కి కోపరేట్ చేస్తూ వస్తుంది కృతి శెట్టి. కొందరు హీరోయిన్స్ సినిమా చేయడం అవతల పడటం లాంటివి చేస్తారు కానీ Krithi Shetty మాత్రం ప్రతి సినిమా ప్రమోషన్స్ కి బాగా కష్టపడుతుంది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గురి పెట్టిన ఈ అమ్మడు ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పడి. నితిన్ సినిమా తర్వాత కృతి సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తుంది. మాచర్ల ప్రమోషన్స్ పూర్తి కాగానే ఆ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు.

 

Tags: Bebamma, Krithi, Krithi Shetty, Macharla Niyojakavargam, Movie Promotions, Nitin, Tollywood