పిల్లలకు రోజుకు 2 గంటలు మాత్రమే ఫోన్…. రాత్రిపూట ఇంటర్నెట్ బంద్..!

చిన్నారులు ఇంటర్నెట్ కు బానిసలుగా మారిపోతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే తీసుకున్న అనేక చర్యలకు కొనసాగింపుగా తాజా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని తొంబై నిమిషాలకే పరిమితం చేస్తూ 2019లో కండిషన్ పెట్టారు. శుక్ర, శని, ఆదివారంతో పాటుగా సెలవుల రోజుల్లో ఈ సమయాన్ని గంటకే పరిమితం చేస్తూ 2021లో నిబంధనలు మరింత కఠినంగా చేశారు.

తాజాగా చిన్నారులు సెల్ ఫోన్స్ వాడకంపై మరిన్ని నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చిన్నారులు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయాన్ని రోజుకు రెండు గంటలకు మాత్రమే పరిమితం చేశారు.’ స్తెబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ‘ (బీఏసీ) ఇందుకు సంబంధించిన నిబంధనలో మోసాయిదాను బుధవారం విడుదల చేయనున్నారు.

• మ్తెనర్లకు రాత్రి 10:00 నుంచి ఉదయం 6:00 గంటల మధ్య ఇంటర్నెట్ లోని చాలా సేవలు ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటున్నాయి.

• 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగించాలి. ఎనిమిది నుంచి 15 ఏళ్లుమధ్య ఉన్నవారు రోజుకి గంట మాత్రమే మొబైల్ ఉపయోగించాలి. 8 ఏళ్లలోపు 40 నిమిషాలు మాత్రమే మొబైల్ ఫోన్ వాడే అనుమతి ఉంది.

• ఈ అంచనాల నుంచి కొన్ని సర్వీసులకు మినహాయింపు ఇస్తారు.మైనర్ల శారీరక,మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్, స్మార్ట్ ఫోన్ లకు కండిషన్స్ ఉన్నాయి. అయితే నిర్ధాష్ణంగా ఏయే సేవలకు ఇంటర్నెట్ ఆంక్షలు మినహాయింపు ఉంటుందని విషయాన్ని సీఏసీ చెప్పలేదు.

• చిన్నారులకు వారి వయసుకు తగిన సమాచారం అందేలా నిబంధనలు తీసుకు వచ్చింది. యూత్ మోడ్ ప్రవేశ పెట్టిన తర్వాత సనుకూల ఫలితాలు వచ్చాయని బీఏసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజా ముసాయిదా నిబంధనల పై సెప్టెంబరు 2 లోపు స్పందసలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. సీఏసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ షార్ట్ మీడియో, ఆన్ ల్తెన్ మీడియో స్మార్ట్ ఫోన్ తో పాటు గేమింగ్ కంపెనీల పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.