ఈ రాశుల వారు వివాహం చేసుకుంటే ఏడేడి జన్మలకు విడిపోరట.. ఇందులో మీ రాశి ఉందా…!

ఈ రాశి వారు పెళ్లి చేసుకుంటే ఏడేడు జన్మలకి కూడా వీళ్లిద్దరే భార్యా భర్తలు అవుతారట. అంతేకాకుండా ఉత్తమ జంటల్ల నిలుస్తారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. వివాహం చేసుకున్న ప్రతి జంట సంతోషంగా ఉండాలనుకుంటారు. తనుకు అనుకూలంగా ఉండే భాగస్వామిని కావాలని కోరుకుంటారు. ప్రతి అడుగులోనూ, సుఖంలోనూ, దుఃఖంలోనూ ఒకరికి ఒకరు ఉండి జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇలా జీవించాలంటే ఇద్దరి మధ్య సమన్యాయం చాలా అవసరం. జీవిత భాగస్వామి రాశి మీ రాశితో కలిస్తే ఇద్దరి మధ్య అన్యోన్య జీవితం ఉంటుంది. అలా క‌లి ఉండే రాశులేంటో చూద్దాం.

మిథున రాశి : తులా రాశి
ఈ రాశుల వారు జోడి అదుర్స్ అనేలా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది. ఇద్దరూ ఒకే మాట మీద నిలబడతారు. జీవితాంతం సుఖసంపదలతో సంతోషంగా ఉంటారు. ఏడేడు జన్మలకు కలిసి ఉండాలని కోరుకుంటారు.

సింహరాశి : తులారాశి
ఈ రెండు రాశులకు చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకున్నట్లయితే వీరి జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఇద్దరికీ సమాజ సేవ పై చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ఇష్టపడతారు.

మేషరాశి : కుంభరాశి
మేష రాశి వారికి కుంభ రాశి వారు అద్భుతమైన జోడి. ఈ రెండు రాశుల వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటారు కానీ ఎప్పుడూ కలిసే ఉండేందుకు ఇష్టపడతారు.

వృషభరాశి : వృశ్చిక రాశి
వృష రాశి వారికి పర్ఫెక్ట్ జోడి వృశ్చిక రాశి వారు మాత్రం. ఈ రెండు రాశుల వాళ్లు పెళ్లి చేసుకున్నట్లయితే గొడవలపై ఆస్కారం ఉండదు. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. నాయకత్వం విషయంలో ఎప్పుడు కోప్పడరు. ఒకరి నిర్ణయానికి మరొకరు ఎదురు చెప్పరు. ఈ రెండు రాశుల వారికి ఒకరితో ఒకరికి ఘనమైన అనుబంధం ఏర్పడుతుంది.

వృషభ రాశి : కన్యా రాశి
ఈ రెండు రాశులకు చెందిన వారు పెళ్లి చేసుకుంటే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇద్దరి స్వభావం బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇద్దరు ఒకరితో మరొకరు నిజాయితీగా ఉంటారు.

సింహరాశి : ధనస్సు రాశి
సింహరాశి వారికి ధనస్సు రాసి వారు కరెక్ట్ అయిన మ్యాచ్. ఈ రెండు రాశులకు చెందిన వారు పెళ్లి చేసుకున్నట్లయితే ఒకరికి అనుకూలంగా మరొకరు ఉంటారు. ఏ పని తల పెట్టాలన్న తాము చెప్పే చేస్తారు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడానికి చూస్తారు.

కన్యరాశి : మకర రాశి
పెళ్లికి అనుకూలమైన జోడిగా కన్యారాశి మకర రాశి వారు ఉంటారు. ఈ రెండు రాశుల వారు పెళ్లి చేసుకున్నట్లయితే ఏడేడు జన్మలకి కూడా వీరు చేయు విడిచి పోరు. ఎన్ని బడుదుడుకులు వచ్చినా కూడా వీరిద్దరూ కలిసే ఉండాలని కోరుకుంటారు. ఇద్దరూ ఒకరు పట్ల మరొకరు నిజాయితీగా ఉంటారు.