టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వారి నోళ్లకు తాళాలు పడిపోయాయి. యువగళానికి ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్క అడుగుతో మొదలైన ఈ యువగళం పాదయాత్రకు నేడు కోట్ల మంది లోకేష్ అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. నడవలేడు.. పాదయాత్ర చేయలేడు అని విమర్శలు చేసినా.. బాడీ షేమింగ్ కు పాల్పడిన లోకేష్ అదరలేదు బెదరలేదు.. తన తండ్రికి రాజకీయ బిక్ష పెట్టిన కుప్పం నియోజకవర్గం నుంచి తొలి అడుగు వేసి నేడు రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నాడు.
తనదైన హావభావాలు.. రాజకీయ పరిణితితో.. ప్రజలతో మమేకమవుతూ నేనున్నా అంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎంత అరాచక పాలన సాగుతుందో ఎవరిని అడిగినా చెపుతారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం రాజధాని లేకుండా దిక్కు మొక్కు లేని అనాధగా మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. సగటు మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించేందుకే అష్ట కష్టాలు పడుతున్నారు. మరోవైపు చదువుకున్న వాళ్ళు.. యువకులు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు.
ఇలాంటి సమయంలో లోకేష్ పాదయాత్ర ద్వారా రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చెక్కుచెదరని నమ్మకం కలిగించారు. పాదయాత్రకు ప్రాధాన్యత ఇస్తూనే.. మరోవైపు మహిళా శక్తి పేరుతో మహిళల అభ్యున్నతి కోసం టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను సైతం లోకేష్ వివరిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. 10 రోజులు కూడా పాదయాత్ర చేయలేడు అన్న వైసిపి విమర్శలను తిప్పికొడుతూ.. ఏకంగా 2007 రోజులు పాదయాత్ర చేస్తూ ఔరా అనిపించాడు. ఒకప్పుడు తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడే లోకేష్ నేను నేడు అనర్గళంగా తెలుగులో ప్రసంగిస్తున్నారు. తనదైన పంచులు.. స్థానిక ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలపై విమర్శలు చేస్తూ తండ్రి చంద్రబాబు చేసిన పాదయాత్ర రికార్డును చెరిపేశారు.
2012లో చంద్రబాబు నాయుడు 2008 రోజుల్లో 2817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేశారు. అయితే లోకేష్ పాదయాత్రను కేవలం 206 రోజుల్లోనే పూర్తి చేసి రెండు రోజుల ముందే తండ్రి రికార్డ్ ను క్రాస్ చేసి సరికొత్త సంచలనం సృష్టించారు. లోకేష్ యువగళం పాదయాత్రకు వైసిపి నుంచి అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. ఒకానొక సందర్భంలో మైక్ కూడా స్వాధీనం చేసుకున్నారు.. కనీసం స్టేజ్ కూడా వేయనివ్వలేదు.. స్టూల్‌పై నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి లోకేష్ కు ఎదురైంది. అయినా వాటన్నింటిని లోకేష్ దిగమింగుకుని ముందుకు దూసుకుపోతున్నారు.
ఎవరు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా… ఎప్పుడు ఏ ఎజెండాతో వచ్చిన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా మొక్కోవని దీక్షతో ముందుకు కదులుతూ రాటు తేలారు. లోకేష్ బహిరంగ సభలకు ప్రజలు.. నాయకులు తండోపతండాలుగా వస్తుండడంతో వాటిపై కూడా ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది అధికార యంత్రాంగం. గన్నవరం సభకు వచ్చిన నేతలపై కూడా కేసులు కూడా పెట్టారు. భీమవరంలో జరిగిన కవింపు చర్యలలో టిడిపి వాలంటీర్లు రిమాండ్ కు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయినా లోకేష్ మరింత రాటు తేలుతూ అలుపెరగని బాటసారిగా ముందుకు కదులుతున్నారు. అందుకే నేడు జయహో యువగళం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కీర్తిస్తున్నారు.