చంద్ర‌బాబు వైపు జ‌నం… జ‌గ‌న్ వైపు ఎవ‌రున్నారు..?

టీడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వరుస పెట్టి టూర్లు చేస్తున్నారు. ఒకవైపు లోకేష్ యువ‌గళం పాదయాత్రలో ఉంటే ఇటు చంద్రబాబు వరుసగా జిల్లాల యాత్రలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో గుత్తిలో ఆయన ఇచ్చిన సందేశం కాస్త వెరైటీగా ఉందని చెప్పాలి. చంద్రబాబు గత సందేశాలకు చాలా భిన్నంగా సరికొత్తగా ఉన్న ఆయన స్పీచ్ బాగా ఆకట్టుకుంటుంది.

నాలుగేళ్ల పాలనలో జగన్ మీకు ఏం చేశారో ? చెప్పాలని ఆయన ప్రజలను ప్రశ్నిస్తున్నారు. జగన్ చేసిన మంచి పనుల్లో కొన్ని అయినా చెప్పాలని ఆయన నేరుగా ప్రజలకే ప్రశ్నలు వేస్తున్నారు. ఏపీని కాపాడుకోవడానికి తాను ఒక్కడినే కాదని.. అందరూ కలిసి రావాలని.. తన పోరాటానికి సహకరించాలని ఆయన పిలుపు ఇస్తున్నారు.

ఏది ఏమైనా చంద్రబాబు ఎమోషనల్ గా చేసిన ఈ ప్రసంగం ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉంది. నాలుగేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని.. ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవడమే అని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. తన బలం బలగం అంతా జనం అని.. తన వైపు జనం ఉన్నారని అటు జగన్ వైపు ఎవరు ? ఉన్నారో వచ్చే ఎన్నికల్లో తేలిపోనుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.