Trivikram Allu Arjun : అల నాలుగోసారి.. కాంబో కన్ఫర్మ్ అయినట్టే..!

Trivikram Allu Arjun : కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు అంటే సినిమా కన్ఫర్మ్ అయితేనే చాలు సినిమా పక్కా హిట్ అనేలా ఉంటాయి. ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి సినిమా తీస్తే పక్కా హిట్ అనే చెప్పొచ్చు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో ఈ మూడు సినిమాలు ఒక దానికి మించి మరొకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక అల వైకుంఠపురములో సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 తో.. త్రివిక్రం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. వారు కమిటైన ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కాగానే మళ్లీ ఇద్దరు కలిసి నాలుగో సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే బన్నీ కోసం ఓ అదిరిపోయే కథ సిద్ధం చేశాడట త్రివిక్రం. పుష్ప 2 షూటింగ్ కి రెడీ అవుతున్న అల్లు అర్జున్ ని కలిసి త్రివిక్రం లైన్ వినిపించాడట.

ఈసారి త్రివిక్రం అల్లు అర్జున్ చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. పుష్ప ఫ్రాంచైజీ తో నేషనల్ లెవల్ లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అందుకే త్రివిక్రం కూడా ఆ రేంజ్ కథనే సిద్ధం చేశాడట. మరి ఈ కాంబోలో వస్తున్న 4వ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఎస్.ఎస్.ఎం.బి 28వ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రం. మహేష్ ఒప్పుకుంటే నేషనల్ లెవల్ రిలీజ్ ఫిక్స్ అయినట్టే.

Tags: Ala Vaikunthapuramulo, allu arjun, Iconstar Allu Arjun, mahesh, Pushpa, Pushpa 2, SSMB28, Superstar Mahesh, trivikram