ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మ‌రోసారి భూమిక..?

పవన్ క‌ల్యాణ్‌, భూమిక ప్ర‌ధాన తారాగ‌ణం నేప‌థ్యంలో వ‌చ్చిన ఖుషి సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే.. అంతే కాదు.. వారిద్ద‌రి కెరీర్ సైతం ఆ మూవీ ఒక మ‌లుపు తిప్పింది. వారి ఇమేజ్‌ను ఒకేసారి ఆకాశానికి తీసుకెళ్లింది. ఆ సినిమా త‌రువాత వారిద్ద‌రు క‌లిసి మ‌ళ్లీ ఏ సినిమాలోనూ క‌లిసి న‌టించ‌లేదు. అయితే ఆ సినిమా త‌రువాత ప‌వ‌న్ చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. తిరిగి జ‌ల్సా సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్న త‌రువాత మ‌ళ్లీ గాడిలో ప‌డ్డారు. కేరీర్ పీక్ టైంలో ఉండ‌గానే రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. సినిమాల‌కు బ్రేక్ ఇచ్చారు. మ‌రోవైపు ఖుషి సినిమా త‌రువాత భూమిక అనే విజ‌య‌వంతంమై చిత్రాల్లో న‌టించింది. ఆ త‌రువాత పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరంగా ఉంటోంది. ఇటీవ‌లే తిరిగి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. స‌మంత యూట‌ర్న్, నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషించి మెప్పించింది.

ఇదిలా ఉండ‌గా.. ప‌వ‌న్‌తో మ‌రోసారి భూమిక జోడి క‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత సినిమాల‌కు రీ ఎంట్రీ ఇచ్చాడు పీకే. వ‌రుస‌గా చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే పింక్ రీమేక్ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని స‌మాచారం. ఆ మూవీ త‌రువాత క్రిష్ తెర‌కెక్కించ‌నున్న పిరియాడిక‌ల్ డ్రామా చిత్రంలో ప‌వ‌న్ న‌టించ‌నున్నారు. ఆ సినిమాలోని ఓ కీల‌క పాత్ర కోసం భూమిక‌ను ఎంపిక చేశార‌ని టాలివుడ్ వ‌ర్గాల స‌మాచారం. ‘ఖుషి’ చిత్రాన్ని నిర్మించిన ఏఎమ్‌.రత్నమే ఈ సినిమాని కూడా నిర్మిస్తుండడ‌డంతో సెంటిమెంట్ పరంగా వర్కౌట్ అవుతుందని భూమికను తీసుకున్నారని తెలుగు సినీ వ‌ర్గాల అభిప్రాయం. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. ఇక క్రిష్ తీస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకునేందుకు సోనాక్షి సిన్హా, ప్రగ్యా జైస్వాల్, నిధి అగర్వాల్‌ పేర్లను పరిశీలిస్తున్నారు.

Tags: am ratnam, Bhoomika, krish movie, pawankalyan, pink, sj surya